: నీలి కొమ్ములు!(ఉత్తర భారత్ జానపద కథ) అచ్యుతుని రాజ్యశ్రీ

 పిన్ని బాబాయి  అనే పేర్లు !అసలుపేరు మర్చిపోయారు వారు కూడా!బాబాయి  శాంతంగా సన్నగా పొడుగ్గా  ఉంటాడు. పిన్ని పొట్టిబుడంకాయి పైగా తెగ వాగుడుకాయ! పిల్లాపీచులేరు.కానీ  బసవ అనే కోడెదూడని పెంచి కొడుకు లా చూసుకుంటారు.అది ఎద్దుగా పెరిగి అందమైన కొమ్ములతో ఠీవి గా ఉంటుంది. ఇద్దరు కల్సి దాని  ఆలనాపాలనా చూసేవారు. ఓసారి  బాబాయి నదిలో ఈతకొట్టేటప్పుడు ఓచేప చేతికి చిక్కింది. దాన్ని ఇంటికి తెచ్చి  కమ్మగా కూర వండమన్నాడు.పొలం పనికివెళ్లాడు.పిన్నికి ఆరోజు వంట చేయబుద్ది కాలేదు.మేనల్లుడి పెళ్లి  కబురు తెల్సింది. ఆపెళ్లికి తను  ఏచీరలు కొనుగోలు చేయాలి  ఏనగ కొనుక్కోవాలి అనే ఆలోచనలో కూరకాస్తా మాడ్చేసింది.బాబాయి పొలం నించి తిరిగి వచ్చాడు. ఆకలి దంచేస్తోంది. కూరమాడువాసనతో అతని కోపం నషాళానికి అంటింది." కష్టపడి చేపని పట్టి తెస్తే  కూరమాడ్చావు" అన్నాడో లేదో తైమని  తాడెత్తున ఎగిరిందామె!"40ఏళ్ళు గా నడ్డి వంచి వండి వారుస్తున్నా! ఈరోజు  ఆరుంబాకా నోరెట్టుకుని అరుస్తావా? మన బసవ కొమ్ములు నీలిరంగులో మారేదాకా నీతో మాట్లాడను..ఫోఫో!" అని అరిచింది.
 భర్త సరిగ్గా తినీ తినకుండా  బైట కి వెళ్ళి గంటపైగా ఐంది. అంతే పిన్ని లో ఏదోపశ్చాత్తాపం! కష్టపడి పని చేసి వచ్చిన మగడి పొట్ట మాడ్చాను అనే బాధ ఆమె ని తొలిచేస్తోంది.ఎద్దు కొమ్ములు నీలంగా మారవు ఎలా? అప్పటిదాకా  ఆగాలంటే ఈజన్మకి అసాధ్యం! ఇలా ఆలోచనలో ఉండగానే మగడు వచ్చాడు. గంజి ఇచ్చింది.మాటలు లేవుగా?పాపం కిమ్మనకుండా తాగేసి బైట కి వెళ్ళాడు.పిన్ని బాగా ఆలోచించి  నీలిరంగు తెచ్చి ఎంచక్కా  ఎద్దు కొమ్ముల కి పులిమింది.ఆరాత్రి ఇంటి కి తిరిగి వచ్చిన  బాబాయి అన్నంతినకుండా ముసుగు తన్ని పండాడు.అర్ధరాత్రి  పక్కన భర్త కన్పడక పోటంతో పిన్ని గాభరా పడింది. కందిల్ తీసుకుని బసవ కొట్టం దగ్గరకు వెళ్లింది.భర్త  ఎద్దు కొమ్ములకు నీలం రంగు పూయటం చూసిగబుక్కున ఆరుంబాకా నోటితో అరిచింది"ఏమయ్యోయ్! నేను సాయం త్రం బసవకొమ్ములకి నీలిరంగు పూశాను.మళ్ళీ  నీవు ఎందుకు పులుముతున్నావు?" బాబాయి నవ్వుతూ అన్నాడు "ఎద్దు కొమ్ములు నీలంగా మారేదాకా నీవు మాట్లాడనని అన్నావు కదా?అందుకు ".🌷
కామెంట్‌లు