" ఆడుకునే బొమ్మకాదు... జన్మనిచ్చే అమ్మ... !";- కోరాడ నరసింహా రావు.
అంతర్జాతీయ...బాలికలదినోత్సవ ప్రత్యేక కవిత... !
=================================
నీ ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే 
   అది నీకు మైనస్సని నువ్వను కుంటే... అది నీ మూర్ఖత్వమే !

సకల సంపదల శ్రీమహాలక్ష్మి.... 
 నువ్ పిలవకుండానే.. నిన్నను గ్రహించి,నీ ఇంట అడుగుపెట్టిం 
దని ఆనందించు... !

ఆ ఆడపిల్లనినువ్వెంత ప్రేమగా 
చూసుకుని, గారాబంగా పెంచి తే... నీ ఇల్లు,అంతభోగ, భాగ్య 
సుఖ, సౌఖ్యాలతో తుల తూగు తుంది... !!

ఆడపిల్లనట్టింటనడయాడుతూ
అక్కగానో,చెల్లిగానోఅలరించిన
ఇల్లెనోయ్... ఇల్లు !

ఆడపిల్ల నీయింటిని వీడి అత్తా రింటికి  వెళ్లిపోతున్నా.... 
  మీరు కలకాలం చల్లగా ఉండా లని,నిండుమనసుతో కోరుకుం టుంది... !అది సాక్షాత్తూ ఆ జగ న్మాత దీవెనతో సమానమే... !!

ఆ ఆడపిల్లనుభార్యగా పొందిన
వాడు...ఆమెను కేవలం కామ కోరికలు  తీర్చుకునే వస్తువు గానో,చాకిరీలుచేసే పనిమనిషి 
 గానో భావిస్తే...తానో బికారి కా బోతున్నట్టే... !

భార్యను ప్రేమానురాగాలుప్రసా దించే  దేవతగా గుర్తించిన వాడే 
భాగ్యవంతుడౌతాడు !

 ఆడపిల్లంటే... నీలాంటి మరో 
 ప్రాణికి జన్మనిచ్చే అమ్మ... !
  నీ ఇష్టమొచ్చినట్టు ఆడుకునే 
 బొమ్మ కాదు... !!
      ******

కామెంట్‌లు