* కలికి తురాయి *;-- కోరాడ నరసింహా రావు !
స్వాతంత్ర్యానికి ముందూ.... 
  వెనుకా... నీ దేశ భక్తికీ, సేవా నిరతికిపులకించింది...భారతమాత హృదయం... !

ఎదురులేని నీ గుండె ధైర్యము 
ఎనలేనిది నీ పోరాట పటిమ !

నీ నిస్వార్ధ సేవానిరతికి నిదర్శ నం...

 అత్యున్నత ప్రధాని పద విని వదులుకున్న నీ త్యాగం !

దేశ సమగ్రతను కాపాడటంలో 
సమైక్యతను నెలకొల్పుటలో... 
సంస్థానాల విలీనానికి... నీవు చూపినతెగువ,అనితర సాధ్యం

నీ సమర్ధతను గుర్తించే.... 
అందరూ ఒకటై... నిన్ను ప్రతి పాడించినా...ప్రధానిగాసెహ్రూ
ను నిలబెట్టి ప్రత్యేకించి రక్షణ 
శాఖకు నిన్నే నాయకుని జేసె 
గాందీజీ..... !  
 
    ఎట్టి సమస్యలకైనా... చెక్కు చెదరని  ఓ ఉక్కుమనిషీ.... !
సర్దార్ వల్లభాయి పటేల్.... !!
భారతమాత కీర్తి కిరీటంలో... 
తళ - తళ మెరుస్తున్న కలికి తురయీ....అందుకొనుమయ్య
నీ దేశ ప్రజల కృతజ్ఞతాభి వంద
నములు 🙏💐🙏🌷🙏
     *******
కామెంట్‌లు