సునంద భాషితం వురిమళ్ల సునంద ఖమ్మం
 దీపించు... దూపించు
  ******
 దీపించు,దూపించు ఈ రెండు పదాలను మన జీవితానికి సదా అన్వయించుకోవాలి.
దీపం చుట్టూ ఉన్న చీకటిని తొలగించి వెలుగుల్ని నింపుతుంది.
అలాగే వ్యక్తులుగా చుట్టూ సమాజంలో ఉన్న అజ్ఞానం,అసమానతల చీకట్లను పారద్రోలి మదిలో  విజ్ఞానం, వివేకపు వెలుతురు నింపాలి.
అలా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే  మనకు మనంగా  రవికిరణంలా దీపించాలి.
దీపించు అంటే ప్రకాశించు,తళ్కొత్తు,పరిఢవిల్లు,అతిశయించు ,ఉరళించు,చిగురొత్తు,ఉన్నతిల్లు లాంటి అనేకములైన అర్థాలు ఉన్నాయి.
మన జీవన గమనం ఉన్నతిల్లాలన్నా, దేదీప్యమానంగా ప్రకాశించాలన్నా... జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా చిగురొత్తాలన్నా తప్పకుండా దూపించాలి.
 దూపించు  అంటే శ్రమపడు, శ్రమనొందు,ప్రయాసపడు, పాటుపడు,పెనగు..ఇలా చాలా అర్థాలున్నాయి.
 ఏదీ తనంత తానుగా దరిచేరదు.శ్రమపడితేనే,పట్టువదలక పాటుపడితేనే కావాలనుకున్నది పొందగలం.
అది విద్య,విత్తం,ఆశ,ఆశయం ఏదైనా సరే దూపిస్తేనే ఆత్మ విశ్వాస కాంతులతో దీపించగలం.
దీపం,దూపం ఇష్ట దైవానికి దీపించడం,దూపించడం అనుకున్నది సాధించేందుకు.
దీపించే దీపావళి చెప్పే సందేశం అదే.
దీపంలా దీపిద్దాం. జిలుగు వెలుగులను పంచుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు