జయం ..!విజయం ..!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్ ,;- హన్మకొండ .

 గెలిస్తే 
గంతులువేయడం 
లక్ష్మీ బాంబులు 
కాల్చడం ...
మిఠాయిలు 
పంచటం 
చొక్కాలు 
చించుకోవడం !
ఒకవేళ --
ఓడిపోయారనుకో ,
ఇంకెముంది ,
బండబూతులు -
అక్షింతలవుతాయి ,
పోస్టర్లను 
పేడముద్దలు 
ముద్దాడతాయి ..
అభిమానంకాస్తా 
అటక ఎక్కుతుంది !
గెలుపు ఓటములు 
క్రీడల్లో ...
అందరికి సమానమే ..!
కలిసొస్తే ..గెలుపు ...
లేకుంటే ఓటమి ...
కావాలని ఓడిపోవడం
ఎవరికి మాత్రం మోదం !?
                ***

కామెంట్‌లు