చతురశ్ర గతిగజల్ పాట--రదీఫ్ : పండుగ;--చంద్రకళ యలమర్తి--విజయవాడ
అట్లతద్దియని పాడుట పండుగ
అతివలు ఆటలు ఆడుట పండుగ

తెలతెల వారక ముందే చేరిరి
తరుణులు గౌరిని కొలుచుట పండుగ

తోటల తోపుల సందడి చేసిరి
కొమ్మల ఊయల ఊగుట పండుగ

తోడును ఇమ్మని కన్నెలు కోరిరి
వరముగ వరునే కోరుట పండుగ

భర్తల కొరకే ముదితలు చేసిరి
పసుపు కుంకుమల నోచుట పండుగ

కుజునీ దోషము తొలగుట కోసము
అట్లను దానము ఇచ్చుట పండుగ

రాతిరి పూజలు రమణులు చేసెను
చల్లని చంద్రుని చూచుట పండుగ

***


కామెంట్‌లు