బాబూ - పాపా;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాబూ బాబూ ఇటురారా
పాపా పాపా ఇటు రావే
ఆటలు పాటలు మీకిష్టం
అవి అంటేనే నాకిష్టం
 
చిట్టీ చిన్నీ మాటలతో
కమ్మని పాటలు పాడుదురా
చిట్టీ పొట్టీ అడుగులతో
అల్లరి ఆటలు ఆడుదురా

అలకలు మాని ఈపూటా
చక్కని కథలూ చెబుతారా
చిలిపీ చిలిపీ గెంతులతో
చక్కగ నాట్యం చేస్తారా

నీతీ న్యాయం సత్యాహింసలు
సమభావనల స్నేహసూత్రముల
కిలకిల నవ్వుల కాంతులతో
జగతిని వెలుగులు నింపండీ!!


కామెంట్‌లు