చందమామ పదాలు;-సుమ కైకాల
1. అరవిరిసిన పువ్వులు
    అందమైన నవ్వులు
    వెదజల్లును వెలుగులు
    ఓ... జాబిలమ్మ!!

2. చిట్టి పొట్టి బాలలు
    అందమైన నవ్వులు
    తేనెలొలుకు మాటలు
    ఓ...జాబిలమ్మ!!

3. సౌమ్యమైన వాక్కులు
    తొలగునులే బాధలు
    కలుగును ఆనందాలు
    ఓ...జాబిలమ్మ!!

4. శ్రావ్యము సంగీతం
    వీనులకే మధురం
    మనసు ప్రశాంతం
    ఓ...జాబిలమ్మ!!

5. అమ్మే నిస్వార్థము
    చల్లని మమకారము
    తేనెల తీయదనము
    ఓ... జాబిలమ్మ!!

కామెంట్‌లు