ఎడారి!(జానపద కథ)అచ్యుతుని రాజ్యశ్రీ

 శివ మహా దైవభక్తుడు."దేవా!నేను రోజూ మంచి మాటలు మంచి పనులతో జీవితం గడుపుతాను.ఇంక నేనేం చేయాలో చెప్పు." "నీవు ఒక్కడివే నీతి నిజాయితీగా వుంటే చాలదు.నీసాటితోటివారు కూడా మంచి గా ఉండేలా మార్చు". శివా తన కుటుంబం లోని వారి ని  మంచి మార్గం లో పెడుతున్నాడు. "దేవా!నాకుటుంబం అంతా మంచి గా ఉంది. " "శివా!నీవు ఒక్కడివే ఉంటే సరిపోదు.ఎవరైనా ఒక తప్పు చేస్తే ఒక్కో ఇసుక రేణువుగా మారిపోతుంది. " కొన్ని రోజులు గడిచాక శివా గమనించాడు తన ఇంట్లో  ఓమూల ఇసుక కుప్ప ఏర్పడింది. "ఏంటిది? ఇల్లు సరిగ్గా ఊడ్వటంలేదా?" భార్య ను అడిగాడు. "అయ్యో రామ! నేను రోజూ శుభ్రంగా రెండు పూటలా ఊడుస్తున్నా.మన పిల్లల గదిలో  ఇంతకన్నా  పెద్ద కుప్పలున్నాయి.." భార్య మాటలు అతనికి  ఆందోళన కలిగించాయి.తన భార్య పాల కల్తీ చేస్తోంది అనే అనుమానం వచ్చింది. కొడుకు కోడలు ఇంకా ఊరి జనాలు అవినీతి పనులు చేస్తూ ఉన్నారు  అని గ్రహించాడు.కానీ తను నిస్సహాయుడు.క్రమంగా  ఆపల్లె ఇసుకతో నిండిపోయింది. కొన్ని ఏళ్ళు పూళ్లకి ఎడారి ఏర్పడింది. మన తో పాటు చుట్టూ ఉన్నవారు మంచి గా  ఉండేలా చూడాలి. బాల్యంలో అమ్మా నాన్న లు చెప్పి నేర్పాలి 🌹
కామెంట్‌లు