కవిగారి కష్టం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆలోచనలను పారిస్తాడు అంతరంగాన్ని పండిస్తాడు
అక్షరాలను అల్లేస్తాడు అర్ధాలను స్ఫురింపజేస్తాడు

అక్షరసేద్యము చేస్తాడు ఆరబము సాధిస్తాడు
అందాలను వర్ణిస్తాడు ఆనందమును కలిగిస్తాడు

కలలను కంటాడు కల్పనలను చేసేస్తాడు
కవనము చేబడతాడు కవితలను పుట్టిస్తాడు

పదాలను పొసుగుతాడు ప్రమోదమును పంచుతాడు
పలువురికి పంపుతాడు పఠనము చేయిస్తాడు

ప్రణయకవితలు వ్రాస్తాడు ప్రేమికులను పరవశింపజేస్తాడు
ప్రబోధకైతలను కూర్చుతాడు ప్రజలను చైతన్యపరుస్తాడు

ప్రకృతిని చూపిస్తాడు పరమానందాన్ని చేకూరుస్తాడు
మనసులను తడతాడు మనుజులను మురిపిస్తాడు

శ్రమ పడతాడు సాహిత్యసేవ చేస్తాడు
సరస్వతీమాతను ప్రార్ధిస్తాడు సుశబ్దంబులు శోభిల్లిగపలికిస్తాడు

కవివరేణ్యుల కాళ్ళకు గండపేండేరము తొడుగుదాం
కవివర్యుల కరాలకు కనకకంకణము సమర్పిద్దాం


కామెంట్‌లు