ఆంధ్ర దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న నటీమణులు ఎవరు ఉన్నారా అని ఆలోచించినప్పుడు జీ. వరలక్ష్మి, సావిత్రీ కనిపిస్తారు అనిపిస్తుంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ బహుమతి పొందిన గొప్ప నటీమణుల పేర్లు చెప్పవలసి వస్తే ఎలిజబెత్ టేలర్, సోఫియాలారెన్స్ కనిపిస్తాయి. మరి నిజమైన నటీమణి ఎవరో మనం ఎప్పుడూ ఆలోచించలేదు. అనునిత్యం మనతో కలిసి మెలిసి ఉండి మన కోసమే జీవిస్తూ మనం జీవించడానికి కారణ భూతమైన వ్యక్తిని మర్చిపోతాం కృతజ్ఞతకు కృతగ్నతకు తేడా తెలియని మనసులు సొంత విషయాలు ఆలోచించుకోవడం తప్ప మిగిలిన వాటికి వెళ్ళే ఆలోచన ఉండదు అలాంటి వారిని తప్పు పట్టడం లేదు కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక్కసారి ఆలోచించండి అని మనవి చేస్తున్నాను మెదడు కు పరీక్ష పెట్టండి తెలిసి వస్తుంది.
గర్భస్థ శిశువును ఈ భూమ్మీదకు తీసుకురావడానికి మాతృమూర్తి పడ్డ కష్టాన్ని లెక్కించడం తల్లి గర్భం నుంచి బయట ప్రపంచానికి రావాలన్న ప్రయత్నంలో ఉన్న బిడ్డకు మార్గం చూపినప్పుడు ఆ తల్లి పడే ప్రసవవేదన ఏ నటి వ్యక్తీకరించగలదు? అలాంటి నాటికి ఆస్కార్ ను మించిన బహుమతి ఇవ్వనవసరం లేదా? నిద్ర రాని బిడ్డకు జోల పాడి అద్భుతమైన సంగీత పరిచయమున్న కళాకారులు కూడా ఇవ్వలేని మగతను ఆమె గుండె మీద నిద్ర పుచ్చుతుంది ఆకలి వేస్తోంది అన్నం పెట్టమని అడగడానికి మాటలు రాని చంటి గుడ్డు ఏమి ఆలోచిస్తుదో తెలుసుకుని దానికి అనుగుణంగా ఆ బిడ్డకు అందించే స్థితిలో ఆమె చూపిన ఆప్యాయత అనురాగం ఏ ఒక్కరికైనా అర్థమవుతుందా? నాకు అనుమానమే. ఒకసారి తండ్రి అజమాయిషీ చెలా ఇస్తూ ఉంటాడు. ఎవరు చేయమన్నారు ఈ పని అనగానే అమ్మ అన్న సమాధానం వస్తుంది తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్నప్పుడు హాస్యంగా అంటాడు భర్త. కొడుకును బాగానే తయారు చేస్తున్నావ్ అన్న దానికి ఆమె ఉక్రోషాన్ని ప్రకటించదు చిరునవ్వే సమాధానం తర్వాత బిడ్డకు చెబుతోంది ఈ పని నాన్న చేయమన్నాడు అలా చేయి నాన్న అని ఎంతో గారంగా ముద్దుగా చెప్తుంది అప్పుడు తండ్రి ఎంత ఆనందిస్తాడు తనే కథానాయకుడు అయినంత అనుభూతి చెందుతాడు. ఇన్ని రకాల అనుభూతులను ప్రదర్శించే అమ్మ నటన ఎంత అమోఘం. ఎవరు నేర్పేరమ్మకు నటన అంటే ప్రకృతి అనేదే సమాధానం. తనకు తెలియకుండా తనకు వచ్చిన అమ్మతనం ఆమెను పరిణతి చెందిన పరిపూర్ణ మనసున్న మనిషిగా తయారుచేస్తుంది. అందుకే అమ్మకు తిరుగు లేదు ఎదురు లేదు అమ్మకు ఎవరూ పోటీ కాదు అమ్మ తప్ప.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి