సుప్రభాత కవిత ; బృంద
కంటికి రెప్పై కాచే తండ్రి
ఏ మూలనున్నా  స్పృషిస్తాడు.

రాకతోనే   వేయి అందాలు
కోటి కోరికలూ  తెస్తాడు.

ఇరుకైన దారిలో నైనా
బెరుకు లేక నడిపిస్తాడు

నిరాశలమీద నీళ్ళు చల్లి
ఆశలు మొలిపిస్తాడు.

చెదిరి పోయిన మనసుకు
బెదురు పోగొడతాడు

జీవిత సత్యాలు కొన్ని
దగ్గరుండి నేర్పుతాడు

నీటివాలు ఎటు నడిపితే
అటు చేరేదే గమ్యం...

అనుకున్నవి కాక
అందుకోగలిగినవే మనవి.

అందలేని విజయాలకు
అలుపులేని కష్టం  తప్పదు.

ఇష్టంగా చేసే పని
కష్టం అనిపించదు

కన్న కలలు పండాలంటే
కళ్ళలో ఊటలు దాటాల్సిందే

ఊహలకు ఊతమిచ్చే
ఊరించి కనికరించే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు