గుళికలు;-డా.రామక కృష్ణమూర్తి
1.లోకంలోకి అడుగుపెట్టావు
ఆనందాల వెల్లువలో.
ఏమిచ్చి వెళ్ళావు తిరిగి
పోయేముందు.

2.వంశానికి అంకురమయ్యి
సంపాదనకు మార్గమయ్యి
సుఖాలకు నెలవయ్యి
ఏమి మోసుకెళ్ళావు కడకు‌.

3.పాపాలు,పుణ్యాలు
దానాలు,పరిహారాలు
శాంతులు,చర్చలు
మాన,అవమానాలు
ఆపగలిగాయా ఎడబాటును.

4.బంధాలు,అనుబంధాలు
రాగాలు,అనురాగాలు
స్నేహాలు,మోహాలు
పరవశాలు,పరిణయాలు
వెళ్ళేనాడు రావెందుకని?కామెంట్‌లు