నాగుల చవితి ;-ఎం. వి. ఉమాదేవి బాసర
తేట గీతి మాలిక 
=============
నాగులచవితి పూజలన్ నయముగాను 
నిష్ఠతోడను జేయంగ నిజముభక్తి 
కార్తి కేయునిమాసంబు కాంతులిడుచు 
ముదితలందరు నుపవాస ముద్రనుండె!!
పుట్టచుట్టును దారమ్ము పోగుజుట్టి 
పసుపుకుంకుమ పూలను పద్ధతిగను
పుట్ట మీదనె యమరించి పుణ్యవతులు 
పాలు పండ్లను నైవేద్య పరముజేసె !!

కన్య లందరు భక్తితో కాంతుగోరి 
నాగపూజలు జరిపింత్రు నయముగాను
పిండి వడపప్పు చిమ్మిలి ప్రియముతోడ
నాగరాజుకు నర్పించ భోగమదియె !!


కామెంట్‌లు