కోతిబావ - అరటిపండు .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 తెల్లవారి నిద్రలేస్తూనే రాత్రి దాచుకున్న అరటి పండ్లు తినసాగాడు కోతిబావ .
అప్పుడే వచ్చిన రామచిలుక "బావకోతి తింటున్నావా పండు అరటి" అంది. "నీతెలుగుతో పిచ్చి ఎక్కించేలా ఉన్నావు ఇదిగో ఒకపండు నువ్వుతిను ప్రతిపండులోనూ ఎన్నోపోషకాలు ఉన్నాయి . ప్రతిఋతువులోను సమస్త ప్రాణకోటికి కావలసిన ఫలాలను ప్రకృతి మనకు ఇస్తుంది. ఇప్పుడు అరటిలో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి అవిఏమిటి అని నీకు వివరిస్తాను.
అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రా
ము మాంసకృత్తులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి.
వందగ్రాముల అరటిలో వున్న పోషకాలు
నీరు - 70.1 గ్రా.
ప్రోటీన్ - 1.2 గ్రా.
కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
పిండిపదార్థాలు - 27.2 గ్రా.
కాల్షియం - 17 మి.గ్రా.
ఇనుము - 0.4మి.గ్రా.
సోడియం - 37 మి.గ్రా.
పొటాషియం - 88 మి.గ్రా.
రాగి - 0.16 మి.గ్రా.
మాంగనీసు - 0.2 మి.గ్రా.
జింక్ - 0.15 మి.గ్రా.
క్రోమియం - 0.004 మి.గ్రా.
కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
సి విటమిన్ - 7 మి.గ్రా.
థయామిన్ - 0.05 మి.గ్రా.
నియాసిన్ - 0.5 మి.గ్రా.
శక్తి - 116 కిలోకాలరీలు
 అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటి నుండి చిప్సు కూడా తయారు చేస్తారు.
అరటి చెట్టు ఆసియా వాయువ్య దేశాలలో పుట్టింది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూగినియా,  మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పపువా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తు పూర్వం 8000 లేదా 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించారు. కాబట్టి న్యూ గినియాలో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు భావించవచ్చు.
వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యంలో కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశంలో వీటి రుచి చూశాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది.
భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటి నుండి చిప్సు కూడా తయారు చేస్తారు. అన్నాడు కోతిబావ .
" అన్నినీకు ఇవి తెలుసు ఎలా?" అంది పిల్లరామచిలుక.
" అదా మన ఆటవిశాఖ అధికారి తనబంగళాలో పిల్లలకు చెపుతుంటే విన్నానులే "అన్నాడు కోతిబావ.
"లేభలేభ " అన్నాది పిల్లరామ చిలుక.
" భలే భలే " అనాలి అన్నడు కోతి బావ తలకొట్టుకుంటూ .
 

కామెంట్‌లు