అబ్బాయి ప్రసన్నవదన్;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆదివారమునాడు అబ్బాయిపుట్టాడు
అమ్మాఅమ్మాఅని అప్పుడేఅరిచాడు

సోమవారమునాడు స్కూలుకూవెళ్ళాడు
సరస్వతీమాతను చక్కగాప్రార్ధించాడు

మంగళవారమునాడు మాటలూనేర్చాడు
ముద్దుగాపలికాడు ముచ్చటాపరిచాడు

బుధవారమునాదు బుద్ధిగాచదివాడు
బుజ్జిపిల్లలతోడ భళేభళేఅడాడుపాడాడు

గురువారమునాడు గటగటాపాఠాలువల్లెవేశాదు
గురువులమెప్పును ఘనముగాపొందాడు

శుక్రవారమునాడు సుద్దులుచదివాడు
శ్రీలక్ష్మిదేవిశ్లోకాన్ని కంఠస్థముచేశాడు

శనివారమునాడు శ్రద్ధగావిన్నాడు
శ్రీవెంకటేశ్వరుని సుప్రభాతమువినిపించాడు

అబ్బాయిని అందంగాతయారుచేద్దాం
పెద్దపెద్దచదువులకు పరదేశాలుపంపుదాం

ఉన్నతమైన ఉద్యోగాలుచేయిద్దాం
మనతెలుగుతల్లికి ముద్దుబిడ్డనుచేద్దాం

బాలల్లారా మీరూచక్కగాచదవండి
బాలికల్లారా మీరూమంచిగామెలగండి


కామెంట్‌లు