శంకరాభరణం-సమస్యాపూరణం;-కిలపర్తి దాలినాయుడు
కిలకిల నవ్వుచు కృష్ణుడు
తలపై నాట్యంబుజేసె తకథిమియనుచున్
విలపించబాముకోలా
హలమున బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్..
----------------------------------------
కలహమ దేలయన్నదశ
కంఠుడు మానడు జానకీ సతిన్
చులకన జేసినాడుగద
శూలిని గొల్చెడి వీరభక్తుడై
జలధులుదాటిరాఘవుడు
జాంభవ,వానర సైన్యమంత,సిం
హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్.
--------------------------------------


కామెంట్‌లు