లలిత తత్వ గీతం :-;-."వినరా... వినరా ఓ జీవా.. !"*** కోరాడ నరసింహా రావు !
వినరా... వినరా  ఓ జీవా.. !
 సత్యముగనరా  సహ  జీవా !!
           "వినరా - వినరా... "
సాధన కొరకే దేహగుడిని నువ్ 
 నిర్మించుకున్నావు !
 ప్రాణ శక్తి తో  సో హం అంటూ 
 జపమునె చేసేవు... నువ్ జప మునె  చేసేవు... !!
    " వినరా... వినరా.... "
మూ లా ధార చైతన్య రహిత 
అజ్ఞానిగ ఉన్నావు !
    అజ్ఞానిగ ఉన్నావు... !!
ఓం కార ప్రేరణతో చైతన్యుడ వైనావు... చైతన్యుడవైనావు !
      "వినరా... వినరా... "
స్వాధిష్టాన చేరి నువ్వు జ్ఞానిగ
  మారావు...నువ్ జ్ఞానిగమారా
 వు... !
  మణిపూరకమున తెలిసీ తెలి యని, మిడి - మిడి జ్ఞానివె యై నావు..., మిడి - మిడి జ్ఞానివె 
ఐనావు... !
         " వినరా... వినరా.... "
అనాహతమ్మున విజ్ఞానంతో 
 ప్రకాశించినావు..., నీవు ప్రకా శించి నావు... !
  విశేష ప్రజ్ఞ తొ  విసుద్ధమ్మున 
 ప్రజ్వలించినావు.. నీవు ప్రజ్వ లించినావు... !
.. సుజ్ఞానముతో,త్రికూటమ్మున
ఆజ్ఞను సులువుగ ఛే దించ గల వు... నువ్ ఛే దించగలవు... !
         " వినరా... వినరా.... "
సహస్రారమున చేరిన, నీవు... 
 తూరీయుడవయ్యెదవు !
  సమాధి స్థితిలో,శాశ్వతానంద స్వరూపము నొందెదవు ... 
 నీ స్వరూపము నొందెదవు !!
 నీ నిజ  స్వ రూపము నొందె దవు.... !!
    .  " వినరా... వినరా.... "
    ********

కామెంట్‌లు