నేను ఓటరుని ;--- కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి
అందరికి తెలిసేలా
ఒక్క రూపాయి ఇచ్చి
ఎవరికి తెలియకుండా
వంద రూపాయిలు లాక్కొనే
వ్వవస్దను చూసి
నాకెందుకులే అనుకునే ఓటరుని

పధకాల పబ్బం గడుపుకుంటూ
ఉపాధి లేకపోయినా
పూట గడిస్తే చాలులే 
పండుగ అనుకునే సాధారణ ఓటరుని

సబ్సిడీలు లేక 
పంట చేతికి రాకపోయినా
ఏడాదికొకసారి వేసే నగదుని చూసి
మురిసిపోయే రైతు ఓటరుని

బాధ్యతలను నెత్తినేసుకుని
రావల్సిన బకాయిలు ఇవ్వకున్న
హక్కులను కాలరాస్తూ
ఉద్యమాలను పరిహసిస్తున్న
జీతం సకాలంలో వస్తే చాలులే
అనుకునే ఉద్యోగ ఓటరుని

పని లేక పరేషాన్ అవుతున్న
రేషన్ లో ఇచ్చి నిత్యవసరాలతో
సర్థుకుపోతున్న శ్రామిక ఓటరుని

చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోయిన
నాయకుల గుప్పించిన హామీలకు
కళ్ళల్లో వత్తులేసుకుని
చకోర పక్షిలా నిరీక్షిస్తూ
కన్నవారికి భారమవుతున్న 
విద్యార్థి ఓటరుని

ఆశల పల్లకీ మోస్తూ
ఉచిత హామీలకు బానిసవుతూ
నాలాంటి ఓటరు ఉన్నంతవరకు
కొత్త నాయకులు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారుకామెంట్‌లు