వానొస్తే ఎంత హాయి;-చంద్రకళ యలమర్తి
చిటపటమని కురిసాయి
తొలకరి చినుకులు
లయలో తకథిమి తాళం
వేస్తున్నాయి జల్లులు

కొండా కోనల్లో కురిసే వాన సవ్వడులు 
వినిపిస్తున్నాయి జలతరంగిణి నాదాలు

 నీటితో నిండాయి వాగు, వంకలు 
 తలపిస్తున్నాయి స్వర్గలోకపు అందాలు 

 పరవళ్ళు తొక్కుతూ  ప్రవహిస్తు
న్నాయి నదులు
రైతన్నలో చిగురింపచేస్తున్నాయి ఆశలు

పల్లె, పట్టణాలలో ఆలస్య మైన ఉదయాలు
బద్ధకంగా విరుచు కుంటున్నాయి వళ్ళు

 వేసవి తాపంతో వేసారిపోయి 
బీటలు వారిన నేలలు 
ఎన్నాళ్ళ కో కురిసిన వాన 
నీటితో  తీర్చుకుంటున్నాయి దాహాలు

వాన నీటిలోపక్షుల జంటలు  
చేస్తున్నాయి  సరి గంగ  స్నానాలు

కురులారబెట్టుకునే పడతిలా 
 విప్పాయి తడిచిన రెక్కలు 
 ఉల్లాసంగా, ఉత్సాహంగా
వేస్తున్నాయి గంతులు 

పక్షుల కిలకిలా రవాలు
కవుల ఉదయాల్లో, హృదయాల్లో  
నింపుతున్నాయి ఆహ్లాదాలు

ప్రకృతి కాంతపచ్చ చీర కట్టినట్టు 
  పోతోంది  అందంగా  హొయలు

భూమాత పరవశించి ఇస్తోంది  
మధుర ఫలాల, పంటల ఆశీస్సులు 

**


కామెంట్‌లు