సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అనలము... అనిలము
  *****
అనలము,అనిలము.. గుణింతంలోని గుడి( ి)తో పూర్తి అర్థమే మారడం భలేగా అనిపిస్తుంది కదూ!
అనలం అంటే అంగారం,ఇంగలం,అగ్ని,తేజం, నిప్పు,మంట,జ్వలనం  లాంటి అర్థాలు ఉన్నాయి.
కొందరిని అనలంతో పోలుస్తారు.నిప్పులాంటి వారు,నీతి, నిజాయితీకి పెట్టింది పేరు అనడం వింటుంటాం.
బ్రతికితే  ధర్మం తప్పకుండా నిప్పులాంటి మనిషిలా బతకాలి.
 "అగ్నికి చెదలు పట్టదు" అన్నట్లుగా  వ్యక్తిగా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా విలువలను కోల్పోకూడదని తెలుసుకోవాలి.
మంచితనం మానవత్వంతో తేజరిల్లాలి.
అనిలంలా  అందరిలో  ప్రాణ "వాయువు" లా ప్రవహించాలి. మలయ మారుతంలా మనసుకు ఆనందాన్ని,ఉల్లాసాన్ని కలిగించాలి.
అనిలం అంటే ఏమిటో అర్థమైపోయింది కదా! అనిలం అంటే గాలి,పయ్యెర, వాయువు,పవనం అనే అర్థాలు ఉన్నాయి.
అనలంలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ వుండాలి.
అనిలంలా మానవతా పరిమళాలను అందరికీ  అందేలా వ్యాపించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు