సుప్రభాత కవిత ; -బృంద
ఆకాశపుఅంచుల పొద్దుపొడుపు
కొత్త కోరికలమేలుకొలుపు

ఆగనికాలపు చక్రభ్రమణం
ఆశే ఊపిరిగా నిరీక్షణం

అస్తిత్వం కోసం నిత్యం
పోరాటం
ఆనందం కోసమే తప్పని
ఆరాటం.

మన మనసులో మబ్బుల
నీడలకు మనమే 
సూర్యకాంతి అవాలి.

మౌనంతో యుధ్ధం
నిశ్శబ్దంగా  చేయాలి.

ప్రశ్నించే మనసుకు
సమాధానం చెప్పాలి

ఆనందపు  చిరునామా
అనుభవించి తెలుసుకోవాలి

అద్భుతమైన క్షణాలకై
అన్వేషణ చేయాలి

మన చుట్టూ అందాలు
మనసారా చూడాలి.

చిన్ని చిన్ని సంతోషాలు
ఎన్నెన్నో పొందాలి.

నింగిలో రంగులు
పైరు కదలికలూ
విహంగాల విహారాలు
కొంగల వరుసలు
కోనేటి కలువలు

అన్నిటా నిండిన అందమే
ఆనందమవాలి

అదే  మధురానుభూతుల
మకరందం

ఉదయానికి ముందు హృదయం 
ఉద్వేగపడే  అనుభూతి హాయైన 
అద్భుతం

అందమైన ఉదయానికి
ఆనందంగా ఆలపించే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు