నా దీపావళి అనుభవాలు... !- కోరాడ నరసింహా రావు.

 (బతుకుబాట 109.)
 నేనుబ్రతుకుబాటశీర్షికనమొలక
లో నాజీవితానుభవాలను 108
భాగాలుపూర్తిచేసిఅప్పుడేఏడు సంవత్సరాలుపూర్తైపోయింది !
తరువాతకూడా...అప్పుడప్పుడూ కధలు, విరివిగా కవితలు, నానీలు, గేయాలూ, గీతాలూ, 
వ్రాయగలుగుతున్నందుకు ఆ సర్వేశ్వరునకుకృతజ్ఞతాభివందనములు !
   నేను కొనసాగిస్తున్న రచనల్లో 
నా అనుభవాలుగా వినాయక చవితి,దసరాపండుగల అనుభ వాలనూ...మిత్రులతోపంచుకున్నా వాటికి బ్రతుకుబాట అని పేరుపెట్టటం గానీ... 109,110.
అని నెంబర్ ఇవ్వటం గానీ జర గలేదు !
   ఆ లెక్కనైతే ఇది 111.వది ఔ తుంది !
  ఈ రోజునాదీపావళిఅనుభవా లను మిత్రులతోపంచుకునేఆవ
కాశం చిక్కింది ధన్యవాదాలు !
     నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేటివరకూ ఎన్నో దీపా వాళుల చీకటి- వెలుగుల అను భవాలు... !
    బాల్యం తొలినాళ్లలో... దీపా వళి వచ్చిందంటే,మతాబులతో
పాటు మా నాన్న మిఠాయిలూ తెచ్చి... ఇరుగుపొరుగు కనీసం
ఓ నాలుగైదిళ్ళకైనా నాచేతే మి ఠాయి పంపించి పంచిపెట్టించే వారు..!ఆరోజుచీకటి పడుతుం డగా ఇంట్లో దేవుడి బల్లమీదదీ పం పెట్టి,  గుమ్మం ముందు మా అమ్మ  కడిగి ముగ్గువేసి దానిపై మూడు మట్టిప్రమిదలలో దీపా లు  వెలిగించి అరటిపల్లో,పంచ దారో నైవేద్యం పెట్టి ఊదబత్తీ వె లిగించి మా ఐదుగురి పిల్లల 
చేతాదండాలుపెట్టించిఆముదం
కర్రచివర ఆకులు తొలగించి ఈ
నెలుమూడింటికి నూనెలో తడి పిన దూదిచుట్టి ఆకర్రతో పాటు 
గోగునారనుంది తీసిన కటికికర్ర ల బొద్దిని కూడా వెలిగించి ఆముదం కర్రను మాపిల్లలచేత పట్టించి... దిబ్బు - దిబ్బు దీపా  వళి , మళ్ళీ వచ్చే నాగుల చవి తి,అనిమూడుమార్లుఅనిపించి 
తరువాత మతాబులు, చుచ్చు బుడ్లు, కాకరొత్తులు, తాలు,భూ చక్రాలు,విష్ణుచక్రాలు,అగ్గిపెట్టెలు, పాముబిళ్ళలు ఎంతో సర దాగా కాల్చి...కాళ్ళుకడుగుకొని
ఇంట్లోకివెళ్లి,ముందుగామూలన
పెట్టిన ఉపారాల లోనుంచి చో డిపిండిఅట్టునుప్రసాదంగా మా 
చేత తినిపించేది !
తరువాత ఐదవరోజు నాగుల చవితి రోజు... చోడిపిండి తోప
రేసి..,చవితి ఘడియల్లోమూల
అన్నం,పప్పు తోప,ఆ  తోపలో      
మధ్యఓబెల్లంముక్కపెట్టిదేవుడి
మూలఉపారాలు తీసి... పాలు
గుడ్లు, చిమ్మిని వగైరా పూజా ద్ర వ్యాలతో దగ్గరలోని పొలాలకు పుట్టలో పాలుపోయ్యటానికి వె ళ్లే వాళ్ళం అక్కడ కూడా పాలు పోసిన తరువాతకొన్నిమతాబు లు వెలిగించేవాళ్ళం !ఆరోజు కూడా చీకటి పడుతుండగా... 
బయట దీపాలు పెట్టటం, మిగి లిన మతాబులన్నీకాల్చేయటం 
   ఈ ఆనవాయితీ ఇప్పటికీ నా అరవై తొమ్మిదేళ్లవయసులోనూ
కొనసాగుతూనే ఉన్నా... అప్పటినుండి ఇప్పటివరకూ అనేక దీపావళి అనుభవాలు !
ఎన్నో దీపావళులు అన్నిపండు గల లానే ఆర్ధిక ఇబ్బందులతో నిరుత్సాహంగా గడిస్తే... కొన్ని నేను కాస్త సంపాదనా పరుడ నైన 15-28... ఏళ్ల మధ్యలో కాస్త ఉత్సాహము, ఉల్లాసము లతో పండుగలు జరిగాయి !
   నేను బాగా చిన్నవయసులో ఉన్న రోజుల్లోనే ఓ దీపావళికి 
కాలుతున్న మందుగుండు నా తలపైన పడి, కాలిపోయి, పెద్ద గాయమై ఎన్నాళ్ళొ బాధ పడి 
మా అమ్మ ఓపిక, శ్రమలతో గాయం నయమైనా... మెదడు లో ఏదో తేడావచ్చి చాలాకాలం 
నాకు బుర్ర సరిగ్గా పనిచేసేది కా దు... !జ్ఞాపక శక్తి ఉండేది కాదు 
ఏం చేస్తున్నానో, ఎలాచేస్తున్నా నో... అంతా యాంత్రికం గానే జరిగిపోయేది !
   నా పదమూడో ఏటనే స్కూల్
వదలి పార్వతీపురంలో ఉమా స్టూడియో లో పనిచేస్తున్నాను, 
ఆరోజుల్లో దీపావళివస్తోందంటే 
వారం, పదిరోజుల ముందునుం డే...నా ఈడువాళ్ళంసిసింద్రీలు 
కాస్తపెద్దవాళ్ళుతారాలుతయారుచేసేవాళ్ళం... ఇందుకోసం బొగ్గునూరి మెత్తగా జల్లించి...
 సురాకారం,గంధకం తెచ్చి అవి కూడా బాగానూరి తగుపాళ్లలో
కలిపి...కాగితపు సిసింద్రీ డొక్కు లు తయారుచేసుకుని దట్టించే వాళ్ళం  !ఎవరి సిసింద్రీలుబాగా ఎగిరితే వాళ్ళే హీరోలు !
     మా చిన్నగురువుగారు నాగ భూషణం గారైతే వాళ్ళ ఇద్దరి పాపల కోసం, సురాకారం,గంధ కం,సిల్వర్బీడు,ఆముదంతెచ్చి వెన్నముద్దలు,చిచ్చుబుడ్లు త యారు చేసేవారు !
మాపార్వతీపురానికిబెలగాంలో
మొదలుపెట్టి రాయఘడా రోడ్డు వరకూ ఒకటే మెయిన్రోడ్ !టౌన్ లో మెయిన్రోడ్ను ఆనుకునే మా
ఉమాస్టూడియో !
దీపావళి రోజు చీకటి పడటం తోనేయువకులంతామెయిన్రోడ్
లో చేరిపోయేవారు !
  ఆ వైపు నాలుగురోడ్ల జంక్షన్ నుండి వారు, ఈ వైపు సారిక వీధి జంక్షన్ నుండి మేము.... 
ఎదురెదురుగా తారాలతో... నేలమీదే, మామీదికి వాళ్ళు, వాళ్ళ మీదకి మేము విసురు కుండే వాళ్ళం !
 ఒకదీపావళికి ఒకబ్బాయికన్ను
పోయింది, మరోదీపావళికి ఒక తనికి చంకలో పెట్టుకున్న తారా జువ్వలన్నీఅంటుకునిఒళ్ళంతా 
కాలిపోయింది !
ఇంకా వీటన్నిటికంటే ముందే... 
ఒక కొమటాయనకి మందుగుం డుతయారుచేస్తుండగా,బాంబు పేలి...ఒకకన్నుపోవటమేకాకుం డా.. రెండుచేతులూముడుకుల
వరకూ ఎగిరిపోయాయి... !
  నా ఇరవై ఐదవ ఏటికి మా ఊర్లోఎదురెదురు తారాజువ్వల
ఆటలను ఆపేసారు !
వయసుపెరగటంతో...ఈపండు
గలసరదాలు తగ్గిపోయాయని అనుకున్నాను గానీ, నిజంగానే జనంలో రాను - రాను పండు గలసందడి,కోలాహలంబాగాతగ్గిపోయింది!ఇప్పుడు ఈవిశాఖ 
పట్నంలో చూస్తే... మాపార్వతీ పురంలో లాగా కటిక బొద్దు లు 
కాల్చరు ! ఆముదంకర్రకు ఈనె లుతీసి వెలిగించరు, ఆ కర్రకే 
 చివర నూనెగుడ్డ చుట్టి దివిటీ లాగా వెలిగిస్తారు ! ఇప్పటి పిల్లల్లో  ఆ హుషారు సందడి కనిపించవు ! బహుశా ఇది కం ప్యూటర్ యుగంఅయిపోవటం 
చేత కాబోలు...ఆసాంప్రదాయా లు కొన్నైనా వీళ్ళు అనుసరించ టం ముదావహమే... !!
      *******
కామెంట్‌లు