గుండె ప్రధాన అవయవం ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
 మానవ దేహం లో గుండె ప్రధాన అవయవం.24 గంటలూ విసుగు విరామం లేకుండా పని చేస్తుంది.రక్తాన్ని పంపు చేసి అన్నీ అవయవాలకు సరఫరా చేస్తుంది.అంత కష్టపడే గుండెకు మనం కొద్దో గొప్పో సహాయం చెయ్యాలి కదా.రోజు వ్యాయామం చేయడం,ధ్యానం చేయడం వంటివి సహాయకారి గా ఉంటాయి. పిజ్జాలు బర్గర్లు వగైరా లాంటి కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తినకుండా ఉండడం మంచిది. పిల్లలకూ గుండెపోటు సమస్యలు వస్తున్నాయి.రెండు రోజుల క్రితం గుండెపోటు తో మరణించిన బాలుడు అన్న న్యూస్ పేపర్ లో చూసాము.యే వయసు వారికైనా శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి అధికంగా పెరగడం కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి.కాబట్టి మన కోసం కష్టపడే గుండెకు మనం కూడా సహాయం చేద్దాం.

కామెంట్‌లు