సుప్రభాత కవిత ; బృంద
నిదురించిన జగానికి
నులివెచ్చని మేలుకొలుపు

మిన్నంటిన సంబరాలు
రంగు నింపిన సంబరాలు

వెలుగువాన కురిసేముందు
ఆగిచూచు తిమిరాలు

అంధకారాలను అణచివేసే
అరుణోదయకాలం

నారింజరంగుల్లో నిండుగా
నవ్వులు వెదజల్లే నింగి

కుంచె చిత్రించలేని
కలము  వర్ణించలేని
మనసు ఊహించలేని
అనుపమాన  సౌందర్యం..

ముసిరిన వెలుగుల
మురిసిన పుడమి

రేపటికై కాపుకాసిన
చూపుల కాంతుల నింపగ

తరలివచ్చు తొలి సంధ్యకు
‌‍కరములు జోడించి  జోతలతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు