ఆనందానికి అర్రులు చాచే
మనిషి... పొందినదానితో...
. తృప్తి చెందిందెప్పుడు... !!
సాటి ప్రాణుల్ని బాధించైనా...
తను ఆనందాన్ని పొందాలను కునే నైజం !
తనది ఏది చేజారినా...పోనీలే
అనుకోలేని తత్త్వం... !
పావురాయి వండుకు తిని...
ఆ పక్షి ఈకతో ఆడుకునే...
వికృతానందం... !
ఆ ప్రాణిలోని స్వేచ్ఛాకాంక్ష
దాని ఈకలోనికి చేరి...
వీలుచిక్కినవేళ,ఎగిరిపోతుంటే
చేజారుతున్న ఆచిటికెడుఆనం దాన్నీ వదులుకోలేక... తన
నిండు ప్రాణాన్ని బలిపెట్ట బోతు న్న మనిషి మూర్ఖత్వం... !
ఓ మనిషీ... పొందినదానితో తృప్తి పడితే...
భాగ్యశాలివే నువ్వు.. !
అందని దానికి ఆశపడితే....
నీ బ్రతుకు నవ్వో...నరకమో!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి