" ఇవి చాలు.... ! "; -కోరాడ నరసింహా రావు !
 మనదేశంసింగపూరో, అమెరికా
వో... చేసేయక్కరలేదు... !
 యేఒక్కప్రాంతంవారూ...తాగు నీరు, సాగునీరు,పారిశుధ్యం, 
   నడిచే రహదారి రోడ్లతో సహా 
ప్రాధమికజీవనానికి...ఇబ్బందులుపడకుండా, బ్రతక  గలిగితే చాలు... !  
   ఇవి... ఇవే  చాలు..... !!
    ******
 
ఈ ప్రపంచానికి...అత్యాధునిక
మారణాయుధాలు, అంతరిక్ష ప్రయోగాలు...సార్వభౌమాధికార యుద్దాలు కాదు, కావలసింది
స్నేహ,సుహృద్భావశాంతిమయ  ఆనంద జీవనం... !
 కక్షలు, కార్పణ్యాలు...కుట్రలు, 
కుతంత్రాలతో రగిలిపోతూ... 
నిరంతర ఆందోళన,అశాంతితో 
బ్రతకటం కాదు...మానవజన్మ కు పరమార్ధం...,సుఖించి,సుఖ పెట్టి...ఆనందిస్తూ.. ఆనందింప 
జేయటమే... !

కామెంట్‌లు