కార్తీకo;పవిత్ర మాసం; - సుమ కైకాల
పరమ పవిత్రo కార్తీక మాసం
భక్తుల పాలిట పూజల మాసం
సూర్యోదయానికి పూర్వం
సూర్యాస్తమయం తరువాత
మంగళకరమైన దీపహారతులు

అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమను పంచే
విదియ భోజనాల పండుగ...
విష నాగులను సైతం పూజించే
నాగుల చవితి పండుగ...
ఉపవాసాలతో వొత్తులు వెలిగించే
కేదారేశ్వర స్వామి నోములు...


అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు
శివనామ స్మరణతో నిండిన గుడులు
కోనేటిలో దీపాలు వదిలే అతివలు
పండుగ వాతావరణం ఉండే కార్తీకం!!...


కామెంట్‌లు