ప్రేమమయం(మణిపూసలు);--పి.చైతన్య భారతితెలుగు ఉపాధ్యాయురాలు,Zphs కవాడిపల్లి, అబ్దుల్లాపూర్ మెట్,రంగారెడ్డి 7013264464
కబళించే కష్టాలను 
ఉబికి వచ్చు కన్నీళ్లను 
ధైర్యమను ఆయుధంతో 
ఛేదించూ చీకట్లను!

వ్యథలన్నియు గాథలుగా 
ఇంటింటికి ఉన్నవిగా 
సహనమే తోడుంటే 
ఆనందం నీదేగా !

హృదయంలో ప్రేమగుణం 
మనసులో సేవాగుణం 
అణువణువున నిండాలి 
శాంతికోరు క్షమాగుణం!

ప్రతిపనిలో సంకల్పము 
మోములోన ఆనందము 
తలుపుతట్టు విజయమై 
సర్వులకది సులభతరము!

చిరునవ్వును వీడబోకు 
చిత్తశుద్ధి మరువబోకు 
మర్మమిదే గెలుపుబాట 
మహిలోనే మానవులకు!

ప్రేమమయము సృష్టియంత 
నిండెనోయి విశ్వమంత 
తనపరుల  భేదమేల?
ఒక్కటేగా మనమంత!కామెంట్‌లు