*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0176)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*హిమాలయ - స్థావర జంగమ - దివ్యత్వ వర్ణన - హిమవంత, మేనకల వివాహము - మేనక తదిదతరులకు సనకసనందనాదుల శాపము - వరదానము*
*నారదుడు:- బ్రహ్మ దేవా, మేనక జన్మ వృత్తాంతం, ఆమె ఎందువలన శాపగ్రస్తురాలైంది మొదలైన విషయాలు తెలియజేయండి.*
*నా మానసపుత్రుడు దక్షుడు తన అరవై మంది కుమార్తెలను, కశ్యపాదులగు ముని శ్రేష్టులకు ఇచ్చి వివాహము చేసాడు. ఈ అరవై మంది లో స్వధా అని పిలువబడే కన్య వివాహము పితరుల తో జరిగింది. స్వాధాకు పితురుల వలన మేనక, ధన్య, కళావతి అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఈ ముగ్గురు కన్యలు కూడా పితరుల మానస పత్రికలు. వీరు అయోనిజలు. కేవలము వాడుక వరకే స్వధా దేవి వీరి తల్లిగా పరిగణించబడుతుంది.  వీరు లోకమాతలు. అందరిచే పూజింపబడతారు. యోగినులు, జ్ఞాన సిద్ధులు కూడా. *
*మూడు లోకములలో ఎక్కడికైనా రాకపోకలు సాగించగల వీళ్ళు ముగ్గురూ ఒక సందర్భంలో విష్ణువు నివాసమైన శ్వేత ద్వీపానికి వెళ్ళి, అక్కడ విష్ణువుకు నమస్కారం చేసారు. అప్పుడు అక్కడ సత్పురుషులు, విద్వాంసులు చేరి మహాసభ నిర్వహిస్తున్నారు. పితరుల కన్యలు అయిన ఈ ముగ్గురూ అసక్తిగా జరుగుతున్న ఆ సభలో వుండి పోయారు. కొంతసేపటి తరువాత ఈ సభకు బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందనాదులు వచ్చారు. వారిని గౌరవించడానికి సభ మొత్తం లేచి నిలబడినా కూడా, మేనక, ధన్య, కళావతులు, లేచి నిలబడ లేదు. సనకసనందనాదులకు నమస్కరించలేదు. దీనితో వారిని స్వర్గము నకు దూరంగా మానవ స్త్రీలు గా జన్మించమని శపిస్తారు. అప్పుడు, ఈ ముగ్గురూ వారిని ప్రార్ధించగా శాపవిమోచనము తెలుపుతారు.*
*మీ ముగ్గురిలో పెద్దదైన మేనక, హిమవంతుని పెండ్లి చేసుకుంటుంది. వారికి "పార్వతి" అను పేరుతో కూతురు పుట్టి, ఆమె చేసిన దీర్ఘ తపస్సు వలన ఎంతో ప్రసిద్దురాలు అవుతుంది. ఈ  పార్వతీ దేవిని శంభునకు ఇచ్చి వివాహము చేయడం ద్వారా మేనక శపవిమోచనము అయ్యి, కైలాసమునకు చేరుకుంటుంది. రెండవ కన్య అయిన ధన్య, జనకమహారాజు అయిన సీర ధ్వజుని వివాహము ఆడుతుంది. ధన్య, సీరధ్వజు లకు "సీత" అనే కన్య జన్మిస్తుంది. మహాలక్ష్మీ స్వరూపమైన "సీత" ప్రభావము వలన ధన్య వైకుంఠ ధామము చేరుతుంది. ద్వాపరయుగం చివరలో పితరుల చిన్న కుమార్తె కళావతి, వృషభానుడు అనే వైశ్యనికి భార్య అవుతుంది. వీరికి "రాధ" అనే కుమార్తె పుడుతుంది. ఈ రాధ ప్రభావంతో, వృషాభానుని పెండ్లి చేసుకున్న కళావతి, రాధతో కలిసి శ్రీకృష్ణుని కి ఎంతో ఇష్టమైన గోలోకధామం చేరుకుంటుంది. ఈ విధంగా ముగ్గురూ శాపవిమోచనం పొందుతారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

కామెంట్‌లు