*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0179)*
 
*కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*మేనకకు దుర్గా దేవి ప్రతయక్షం అవడం - వరములు ఇవ్వడం - మైనాకుని జననం*
*నారదా! హిమవంతుడు, మేనకలను దుర్గా దేవి పూజ చేయడానికి సంసిద్ధులు అవమని చెప్పి దేవతా సమూహముతో కలసి విష్ణువు, నేను మా మా ఇండ్లకు వెళ్ళాము. మా మాటను అనుసరించి మేనకా హిమవంతులు, దేవీ పూజ చేయడానికి ఉద్యుక్తులు అయ్యారు. మనసులో సత్సంతానము కాలగాలి అనే కోరికను ఉంచుకొని, శంభుదేవుని, శివదేవిని అహోరాత్రాలు మనసులో తలచుకుంటూ, గొప్ప తపస్సు ప్రారంభివారు. తమ కోరిక నెరవేరడానికి, మేనక 27 సం.ల ఘోర తపస్సు చేయాలని సంకల్పం చేసుకుంది. కొన్ని సార్లు ఆకులు, కందమూలాలు తిని, కొన్న సార్లు కేవలం నీరు తాగి, ఇంకొన్ని సార్లు గాలి మాత్రమే పీల్చుకుంటూ జగజ్జనని అయిన ఉమాదేవి తపస్సు చేయ సాగింది. కొన్ని సార్లు, బ్రాహ్మణులు, ఋషులకు ఉచిత దానాలు చేసింది. గంగానది ఒడ్డున ఓషధి ప్రస్థంలో ఉమాదేవి మట్టి ప్రతిమ చేసి పూజించింది. ఇలా నిరంతరంగా, నిశ్చలంగా, నిరంతరాయంగా తనను గూర్చి తపిస్తున్న మేనకను చూచి జగన్మయి శివకామిని జగదంబ అయిన ఉమాదేవి ప్రసన్నురాలు అయ్యింది. మేనకను అనుగ్రహించాలని తేజోమండల మధ్యమున దివ్యాభరణ భూషితురాలై, అద్భుతమైన అలంకరణ గల బంగారు సింహాసనము మీద కూర్చుని మేనక ముందు ప్రత్యక్షమై "గిరిరాజు హిమవంతుని భార్యవైన మేనకా, నేను నీ తపస్సు మెచ్చి, నీ మనసులో వున్న కీరికలన్నీ తీర్చడానికి వచ్చాను. నీవు చేసిన తపస్సు కు ఎంతో సంతుష్టను అయ్యాను. నీకు ఏమి కావాలో కోరుకో, మేనకా!" అని పలికింది, సర్వజ్ఞ.*
*"అమ్మా, నేను నిన్ను కీర్తన చేయాలి అనుకుంటున్నాను. నాకు అనుజ్ఞ ఇవ్వు తల్లీ!" అని మేనక అడుగగానే, కరుణించి న హృదయముతో తన రెండు చేతులు చాచి మేనకను తన హృదయానికి హత్తుకుంది, జగన్మాత. వెంటనే, మేనకాదేవి కి మహాజ్ఞాన ప్రాప్తి అయి, అమ్మను ఇలా కీర్తించింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు