*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0180)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*మేనకకు దుర్గా దేవి ప్రతయక్షం అవడం - వరములు ఇవ్వడం - మైనాకుని జననం*
*నారదా! మేనక, ఉమాదేవి స్తుతి ఈ విధంగా చేసింది. "అమ్మా, నీవే ఉమవు, లోకధారిణివి, చండికవు, అందరి మనసులో వున్న కోరికలను తీర్చగల దానివి. నీకు నమస్కారం. నీవు నిత్యమైన ఆనందాన్ని ఇచ్చే మాయవు, జగజ్జననివి, అందమైన కలువపూల మాల ధరించివుంటావు. మహర్షులకు అజ్ఞానాన్ని తొలగించే బ్రహ్మ విచ్యవు నీవే. అథర్వవేదమందలి హింసవూ నీవే. పంచ భూత సముదాయమును జోడించి వాటికి శక్తిని ఇచ్చే దానవు నీవే. సూర్యుని లోపల కాంతి, అగ్ని లోపల వేడిమి, చంద్రుని లోని చల్లదనము అన్నీ నీవే. అటువంటి చండీ దేవివి అయిన నిన్ను కీర్తిస్తున్నాను. శ్రీహరి చూపే మాయవూ నీవే. బ్రహ్మ, విష్ణువు, రుద్రులకు కారణము నీవే. వారు ముగ్గురూ నీవే అయిన జగన్మాతా నాకు ప్రసన్నురాలివి అవు తల్లీ!".*
*ఈ ప్రార్థన విన్న శంభునిరాణి, మేనకతో " నీవు చేసిన కీర్నలు నాకు సంతోషం కలిగించాయి. నీ మనసులోని కోరికలు అడుగు. నీవు ఏ కోరికను అయినా కోరదగిన దానవు. సంకోచిచకు." అని తన చల్లని చూపులు మేనకపై ఉంచుతుంది. అమ్మ చల్లని చూపులు మేనక శరీరాన్ని తగలగానే, తపస్సు వల్ల నొచ్చిన ఆమె శరీర బాధలు అన్నీ తొలగిపోయి మునపటి సౌందర్యరాశి అయ్యింది మేనక.*
*అప్పుడు మేనక, జగద్ధాత్రి అయిన సతీదేవి తో" అమ్మా నాకు ఉత్తమ గుణ సంపనులు, దీర్ఘాయువు కలిగినవారు, అతి బలపరాక్రమాలతో, బుద్ధి కుశలతతో, ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షము కలిగిన నూరు మంది కుమారలను అనుగ్రహించు. ఆ పిదప, ఒక్క కుమార్తెగా నీవే జన్మించి, సదాశివుని వివాహమాడి, దేవతాగణము అందరికీ సంతోషము కలిగించు." అని కోరుకుంది. "నీవు కోరిన కోరికలు నీకు ఇస్తున్నాను. నేను నీ ఇంట పార్వతి గా పుట్టి అందరికీ ఆనందాన్ని పంచుతాను." అని చెప్పి, మేనక చూస్తుండగానే అదృశ్యం అయ్యింది, లోకమాత.*
*తరువాత కొంతకాలనికి గర్భవతి అయిన మేనక, మైనాకునికి జన్మ ఇస్తుంది. మైనాకుడు, మహా పరాక్రమశాలి. తన తరువాత పుట్టిన అందరిలో ఉత్తమమైన వాడు. సముద్రునితో చక్కని చెలిమి చేసాడు. పర్వతరాజపథమును అందుకున్నవాడు, మైనాకుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు