*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 086*
 *ఉత్పలమాల:*
*భానుఁడు తూర్పునందు గను | పట్టినఁబావక చంద్ర తేజముల్*
*హీనత జెందినట్లు జగ | దేక విరాజితమైన నీపద*
*ధ్యానము సేయుచున్న ఁబర | దైవ మరీచులడంగకుండనే*
*దానవ గర్వ నిర్దళన | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
రాక్షసుల గర్వమును అణచివేసే కాతి గలిగున వాడా! తూర్పున ఉదయించే సూర్యని కాంతినీ, పున్నమి నాటి చంద్ర కాతినీ, అగ్ని దేవుని వేడిని కాంతీనీ కూడా తగ్గించల గలదు జగత్తును పాలించే నీ పద్మ పాదముల నుండి వచ్చే కాంతి! ఈ నీ పదముల నుండి వచ్చే కాంతి ఇతర దేవీ దేవతల కాంతిని హరించి వేస్తుంది!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"బ్రహ్మ కడిగిన పాదము", ఈ పాదమును మనసులో నిలుపుకొని నిత్యము ధ్యానము చేస్తూ వుంటే జరుగని పని, నెరవేరని కోరికలు ఈ చరాచర జగత్తు లో వుండవు. ఈ పద్మ పాదమే కదా, అహల్యకు శాప విమోచనము చేసి సుందర రూపాన్ని తిరిగి ఇచ్చింది. ఈ పాద ధూళి ప్రభావము తెలుసుకునే కదా గుహుడు రామపాదాలు కడిగాడు, నావ లోకి ఎక్కే‌ముందు. లోకాలను శాశించే పాదము, రుద్ర తాండవము చేసే పాదము, తన పద ఘట్టనతో  మనలో వున్న మద మత్సరాలను అణగతొక్కే పాదము, ఈ పాదాన్ని తెరచాపగా పట్టుకుంటే వైతరణి దాటడం సమస్యే కాదు. అతి సుళువుగా దాటేస్తాము. అంతటి దివ్య, భవ్య పాద పద్మాలను పట్టుకుని వుండగలిగే దివ్యానుభూతిని మనకందరకూ అనుగ్రహించమని నిర్గుణ నిరాకార నిరంజన రుద్రదేవుని ప్రార్థిస్తూ! ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు