మాతృభాష;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రపంచ భాషల్లో  ఏ భాషకు లేని ప్రత్యేకత ఆంధ్ర భాషకు ఉన్నది  అసలు మన భాష ఏమిటో మనకు తెలియదు  36 అక్షరాలతో కలిపి మాట్లాడే తెనుగా  55 అక్షరాలతో మాట్లాడే తెలుగా  పరిణతి చెందిన పరిపూర్ణ 56 అక్షరాలతో ఉన్న ఆంధ్రమా  మనం ఏ భాషను మాట్లాడుతున్నాము  అసలు మన పద్ధతే భారతదేశంలో నేతి అన్న నీతిని అనుసరిస్తున్నాం. నేతి అంటే  ఘుమఘుమలాడే వెన్న కాచిన నెయ్యి కాదు ఘ్రుతము అన్న అర్థం లో చెప్పరు  సంప్రదాయం వరకు వచ్చేసరికి  వ్యతిరేకార్థమే వస్తుంది నీవు ఏం చేయవలసి ఉన్నదో దానిని మాత్రమే  బాధ్యతాయుతంగా చేయమని చెప్పేదే మన సంస్కృతి మన సంప్రదాయం  న- ఇతి, ఇది కాదు అని చెబుతోంది మరి ఏది అని ప్రశ్నిస్తే దానికి సమాధానం పెద్దలు చెప్పరు  నీ అంతట నీవు స్వయంకృషితో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. సామాన్యంగా ప్రతి ఇంట్లోనూ  కూలి నాలి చేసుకుని ఆరోజు భోజనానికి ఏర్పాటు చేసుకునే వ్యక్తుల నుంచి  ప్రతి ఒక్క గృహిణి  ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు  బియ్యం పూర్తిగా అయిపోయినాయి వాటిని తెప్పించండి అనదు.  ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అని చెబుతోంది అంటే మనకు ఏం అర్థం అవుతుంది  ఇంకా నెలకు రెండు నెలలకు సరిపడినటువంటి బియ్యం  నిల్వ ఉన్నవి అని అర్థమవుతుంది  కానీ ఆ చెప్పిన విషయం భర్తకు అర్థం అవుతుంది ఓహో అలాగా నేను వచ్చేటప్పుడు తీసుకొస్తానులే అని సమాధానం చెప్తాడు  ఎవరిని ఉద్దేశించి ఏది చెపుతామో అది వారికి అర్థం అవ్వడమే భాష యొక్క ప్రయోజనం  లేకపోతే దేశంలో ఇన్ని భాషలు రావడానికి అవకాశం ఉండదు మాటలు లేకుండా మూగగా సైగలు చేసుకుంటేనే సరిపోతుంది కదా.
అలాగే దీపం ఆరిపోయినప్పుడు ప్రమిదలో నూనె అయిపోయిన తరువాత  వెలుగు ఆరిపోతుంది.  దీపం ఆరింది అని గృహిణి చెప్పదు  ఒకవేళ చెబితే వేరే అర్థం గుర్తుకొస్తుంది  శరీరంలో ఉన్నటువంటి జీవం పోయింది అతను భౌతికంగా మరణించాడు అని చెప్పే అర్థం  వస్తుంది  కనుక ఇలానే అంటుంది  దీపం కొండెక్కింది  అంటే కొండపైన ఈ దీపం వెలుగుతూ ఉన్నది ఇక్కడ కొద్ది వెలుగును ప్రసరింప చేసే దీపం కొండమీద  మరింత వెలుగులను విరజిమ్ముతూ ఉంది అన్న అర్థం మనకు తెలుస్తుంది కానీ దానిని విన్న భర్త దానిలో నూనెను పోసి  దూది తో వత్తిని చేసి  అగ్గిపుల్లతో వెలిగిస్తే అది మళ్ళీ  వెలుగులను మనకు ఇస్తుంది  ఇలా ఆంధ్ర భాషలో ఉన్న సొగసులు మరి ఎక్కడా ఉండవేమో...! మన అష్టావధానాలు కానీ శతవధానాలు కానీ  మిగిలిన భాషలలో కనిపిస్తూ ఉంటాయా? అలాంటి ఆంధ్ర భాషను మృత భాష అంటే  ఎవరైనా అంగీకరిస్తారా? కనుక అమ్మ గురువుగా చిన్నపట్టి నుంచే వారికి మన ఆంధ్ర భాష విశిష్టతను తెలియజేయాలి. అందరూ తెలియజేస్తారుగా మరీ...


కామెంట్‌లు