ఏ ఇంట్లోనైనా పిల్లల బాధ్యత తల్లికి ఉన్నంత ఎక్కువగా తండ్రికి మిగిలిన వారికి ఉండదు. సమయం లేకపోవచ్చు దానిమీద అవగాహన లేకపోవచ్చు కారణాలు ఏవైనా తల్లి ఆ బాధ్యత స్వీకరిస్తుంది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా అత్యవసరమైన పదార్థం ఏమిటి నీరు ఆహారం ఈ రెంటి విషయంలో తల్లి జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏ వైద్యుని దగ్గరికి తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉండదు భోజనం లేకుండా కొన్ని గంటలు ఉండవచ్చు కానీ నీరు లేకుండా ఎక్కువ సమయం ఉండడం కష్టం దానికోసం తల్లి మంచినీరు వాడడానికి అవగాహన కల్పించాలి. నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? రోజు మొత్తం మీద ఎన్ని గ్లాసులు నీరు తాగితే సరిపోతుంది అన్న విషయం బిడ్డకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు పిల్లలు ఐదు గ్లాసుల నుంచి తొమ్మిది గ్లాసులు వరకు నీళ్లు తప్పకుండా తీసుకోవాలి దీనిని క్రమ పద్ధతిలో తీసుకుంటే చాలా మంచి చేస్తుంది శరీరానికి అవి ఎలా చేయాలి అన్నది అమ్మ చెబుతుంది మనం భోజనానికి కూర్చున్నప్పుడు కొంతమంది పిల్లలు ప్రతి ముద్దకు కొంచెం నీరు తాగుతూ ఉంటాడు. ఇది శరీరానికి చాలా హాని చేస్తుంది అని వారికి తెలియదు అలా చేయడం వల్ల జీర్ణక్రియ బాగా దెబ్బతింటుంది దానివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి అవి రాకుండా చూడాలంటే అమ్మ వారు నీరు తాగడానికి ప్రయత్నించే ప్రతిసారి అలా చేయకూడదు నాన్న ముందు భోజనం చెయ్ తర్వాత తాగవచ్చు అని చెప్పాలి. ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే లావుగా ఉన్నవాళ్లు భోజనం చేసే ముందు కొంచెం నీళ్లు తాగాలి దానివల్ల చేసే భోజనాల్లో కొంత శాతం తినలేకపోతే దానివల్ల కొంచెం శరీరం తగ్గుతుంది.
పెద్దవారైనా చిన్న పిల్లలైనా జీవనం కోసం సక్రమంగా పనిచేయాలి అంటే అన్నకోశాన్ని నాలుగు భాగాలు చేయాలి ఒక భాగం ఖాళీగా ఉంచి ఒక భాగం నిండా నీరు తాగి మిగిలిన రెండు భాగాలకు సరిపడిన భోజనం చేస్తే ఈ ఘనపదార్థం ద్రవపదార్థంతో కలిసి వాయు పదార్థం సహాయంతో అద్భుతంగా జరుగుతుంది జీర్ణక్రియ ఆయుర్వేదంలో చెప్పారనే కాదు మామూలుగా మీరు చూడండి అక్కడ గమనించగలుగుతారు. "భుక్తేషు శత పథ గచ్చేత్" అని సంస్కృతంలో చెబితే ఆంగ్లంలో "walk a mile after a meal" అంటారు ఆంధ్ర భాషలో అయితే భోజనం చేసిన తర్వాత కనీసం వంద అడుగులైనా వేయాలి భోజనం చేసిన వెంటనే పండుకొని నిద్రపోకూడదు దానివల్ల ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది పెరిగిన తర్వాత తగ్గించుకునే ప్రయత్నం చేయడం కన్నా అసలు పెరగకుండా చూసుకోవడం ఉత్తమం కదా.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని తల్లి బిడ్డకు చెప్పినప్పుడు అతని జీవితం ఆనందమయంగా నడుస్తుంది ఆమె చెప్పకపోతే అనుకుంటే ఆ బిడ్డ జీవితం నరకమే బాగు చేయాలన్న, చెడగొట్టాలన్న అమ్మే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి