ఏళ్ళ తరబడి సర్కారు బడులకు సేవలందిస్తూ...
అక్షర జ్యోతుల నీడలో వెలుగు త్రోవ చూపిస్తూ...
పుస్తక పాఠాల పేరిట సద్బుద్దులను నేర్పిస్తూ…
నవతరాల భవితకు బంగారు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు...
జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తుంటే...
చాలీచాలని చిల్లరతో జీవనాలను వెల్లదీస్తుంటే...
ఆ దుర్భరమైన, దయనీయ దీన గాధలను చూసి చలించి...
ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలను చేపట్టి...
సత్యాగ్రహాలకు శ్రీకారం చుట్టి రణభేరిని మ్రోగించారాయన...
ఉపాధ్యాయ కుటుంబాన్ని తన సొంత కుటుంబం కన్నా మిన్నగా
భావించి ఉపాధ్యాయుల జీతభత్యాల కోసం నిస్వార్ధంగా పోరాడారాయన...
ఉద్యమ పోరులోఎవ్వరినీ నొప్పించకుండ, ఏ విభేదాలకు తావివ్వకుండ
అందరిని సమన్వయం చేసుకుంటూ సమరాన్ని
ముందుకు సాగించారాయన...
నిష్టగా నియమాలను పాటిస్తూ, ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుంటూ,
సఖ్యతను చూపిస్తూ, సమైక్యతను పాటిస్తూ నిజజీవితంలో
ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారాయన...
ఉపాధ్యాయుల హక్కుల కోసం ఆజన్మాంతం శ్రమించి తన సమస్తాన్ని
ఎ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయుల సంస్థ నిర్మాణం కోసం త్యాగం చేశారాయన...
బ్రతక లేకనే బడిపంతులు అన్న నానుడిని తిరగ రాసి
బ్రతికించే వాడే బడిపంతులు అన్న కొత్త అర్థానికి శ్రీకారం చుట్టారాయన...
నేటి సమాజంలో నిజమైన విలువలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన
మాన్యులైన సింగరాజు రామకృష్ణయ్య గారు ధన్యజీవి...
పుణ్యజీవి...
ఆదర్శజీవి...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి