స్నేహం ;-యలమర్తి అనూరాధ-హైద్రాబాద్-చరవాణి:924726౦206
 స్నేహమే తలుపు తట్టింది అకస్మాత్తుగా
అంతులేని ఆనందం ఎద సముద్రంలో
కోటి వెలుగుల కాంతులు కళ్ళ ఆకాశంలో 
ఉత్సాహ తరంగాలు అణువణువున అలల్లా
సప్తస్వరాలు రాగాలై పల్లవి పాడుతోంది
పులకరించిన మనసు పాటల పల్లకిపై 
ఊహల చెక్కర్లు 
స్నేహ సందడి ప్రారంభం
మేమిద్దరం లోకాన్ని పట్టించుకోలేనంత సంబరంలో !

కామెంట్‌లు
Ramesh Babu Namineni చెప్పారు…
వెరీ నైస్ మేడమ్
Yalamarthy Anuradha చెప్పారు…
సంతోషమండీ