సృష్టి;-: కె.కె తాయారు; మదనపల్లి,(అన్నమయ్య జిల్లా)చరవాణి : 9440460797

          ఎఱ ఎఱ్ఱని  కెంపు చాయల గగనం
         కైమోడ్పు  సేయ,
         పచ్చని కోకలో సొగసుల ధరణి
         పులకించె  నునువెచ్చని భాను
         కిరణాలలో,
         ప్రతీ ప్రాణి స్పందించ, ఇల వెలిగే
         నా  సూర్యుడు అఖిల జగములు
         ఆనంద సంద్రమున ఓలలాడా,
         ఉదయంపు కాంతుల తెలి వెలుగుల,
         సుమలతల పరిమళాలు భువిని నింప
         పచ్చని పొలాల తలలూతల తప్పెట్ల
         వెనువెంట దరిత్రి లో కదలికలు రాల
         రాగ సుమధురాలు పంచనేతెoచె రవి
        పిల్ల తెమ్మరల మృదు మధుర సవ్వడి
        గిలిగిలింతలిడ ప్రకృతి ఫక్కు మనగ
        తుమ్మెదల ఝాoకారములతో
        ఉదయకాంతుల పరీష్వoగముల
        స్నానమాచరించి,
        నిలదొక్కుకున్న, ధరణి ముదమున గీత
        మాలపించ,
        నీటి ప్రవాహాలు నిర్మలత్వం బొసగ
        నిజ దైవ దర్శనంబీయ
        ధరణి యంతయు నిండే దైవంపు ఛాయ,
        మధుర ధరహాసంతో ప్రకృతి ముదమలరగ
        పిల్లగాలుల కవ్వింతలు గిలిగింతలిడగ
        తరులు భావతమక మందివ్వ
        ఆ చిత్ర విచిత్ర విన్యాసాలని తిలకించ
       పులకించ. హృదయం పొంగిపొరలు
       అమ్మవడి  అమృత మయం
       ప్రకృతే మాత  ప్రతి ప్రాణికీ
      ప్రకృతి పులకించెనా ధరణికందం,
      ధరణి పులకించెనా ధన్యజీివులకందం
       ఈ ప్రకృతి ప్రతి జీవికి అందమే
       ప్రతీ ప్రాణికీ ఆనందమే
         
       
కామెంట్‌లు