వ్యాసుల వారి భారతం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 పురాణ కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ, మనం చూసిన వారిలో భారత రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం ఇద్దరూ కూడా  గొప్ప రాజనీతిజ్ఞుడు  చెప్పిన మాటకు కట్టుబడిన వ్యక్తులు. వీరిద్దరూ కూడా అందరి ఆదరాభిమానాలను పొందిన వారే. నిజానికి ఆరాధ్యదైవాలే కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన న్యాయాన్ని  కలాం గారు చెప్పిన ధర్మాన్ని  నీతులను, ప్రవచనాలను ఏ ఒక్కరూ ఆచరించలేదు. అటు పురాణాలలో ధృతరాష్టుని చూసినా ఇక్కడ సోనియాగాంధీని పరిశీలించినా తమ సంతతి మీద విపరీత ప్రేమాభిమానాలతో వారి క్షేమాన్ని మాత్రమే కోరుకుని  గుడ్డివారీగా మిగిలిపోయిన వారు అటు దుర్యోధనునితో రాహుల్ గాంధీని పోల్చినట్టయితే ఇద్దరికీ శక్తి సామర్థ్యాలు లేవు  అయినా  వంశపారంపర్యంగా అధికారాన్ని  చేజిక్కించుకున్నారు.
అటు ప్రపంచానికే ఆదర్శమూర్తి అయిన భీష్మాచార్యుల వారు  ఇటు భారతదేశంలో ఆదర్శమూర్తిగా పేరు తెచ్చుకున్న అద్వానీ గారు  ఇద్దరూ శక్తి సామర్థ్యాలు ఉన్నవారే అయితే వారికి గౌరవం దక్కింది కానీ ఇద్దరికీ అధికారం మాత్రం దక్కలేదు  కానీ జీవిత చరామంకాల్లో నిస్సహాయులుగా మిగిలిపోయారు  అలాగే అర్జునుడు నరేంద్ర మోడీ గార  లను కొంచెం పోల్చి చూస్తే  ఇద్దరూ కూడా నైపుణ్యం కలిగి ధర్మం ప్రకారం నిలబడడం వల్ల అందలం ఎక్కిన వారే  కానీ ధర్మాన్ని పాటించడం ఎంత కష్టతరం  జ్ఞానోదయం అయింది. ఈనాటి మన్మోహన్ సింగ్ గారిని ఆనాటి కర్ణుని  తలచుకుంటే ఇద్దరూ తెలివైన వాళ్లే  కానీ అధర్మం వైపు ఉండడం వల్ల అధికారాన్ని ఎప్పుడు అనుభవించలేకపోయారు.
యువతలో అభిమన్యుని కేజ్రీ వాల్ ను  ఇద్దరినీ పోల్చి చూసినట్లయితే ఇద్దరూ కూడా యుద్ధానికి కొత్తవాళ్లే  వ్యూహాలు చేయడం చేతకాని వాళ్లు  శత్రువులు పన్నిన చక్రవ్యూహం నుంచి బయటపడలేకపోయిన వాళ్ళు  వారిని చూస్తే జాలిపడవలసిందే చివరగా  శకుని, దిగ్విజయ్ సింగ్ వీరికి ధర్మం న్యాయం ఏమిటో నీతి ఏమిటో అన్ని తెలిసి వాటిని తుంగలో తొక్కి ఏ ఒక్క దానిని అనుసరించనివారు. తమ అవసరాలు తీర్చుకోవడానికి  తమ  శబధాలను నిలబెట్టుకోవడానికి  తాము తమ నాయకులకు అధికారాన్ని కట్ట పెట్టాలన్న కుతంత్రంతో  వారిని అధికారంలో చూడాలనుకున్నవారు. వ్యాసమహర్షి వ్రాసిన  మహాభారతంలో  ఈ తత్వాలు అన్నిటినీ పొందుపరిచాడు  ఆ తత్వాలు ఈనాటికీ ఎక్కడా మారిన, దాఖలాలు లేవు  అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ప్రతిక్షణం స్వార్థాన్ని  ఆస్వాదిస్తూనే ఉంటాడని మనమర్థం చేసుకోవచ్చు.
కాలం మారినా మనస్తత్వాలు మారవు అన్న నగ్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడమే  వ్యాస మహర్షుల వారి ధ్యేయం.

కామెంట్‌లు