ఉలిపి కట్టె;--ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మేధకు జ్ఞాపకశక్తి తోడైతే  మంచివిమర్శకుడు అవుతాడు  మా గన్నవరం రత్నబోస్ అలాంటివాడు  నాటక సంస్థను స్థాపించి  కొత్త నాటకాలను వ్రాయించి,
కొత్త నటీనటులను  ప్రోత్సహిస్తూ నాటకాలు చేశాడు. అనేక నాటకాలకు న్యాయనిర్ణేతగా వెళ్ళినా  అల్లూరి సీతారామరాజు పేరు చెపితే ముందు బోస్ పేరు చెప్తారు. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు.దానికి అతనిలో ఉన్న పట్టుదల,  అంకితం  భావం కారణం. ఏ. శివ రామ రెడ్డి గారు ఉలిపి కట్టె నాటకం వేస్తున్నప్పుడు  ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది అన్నది బాగా నచ్చి వారి కన్నా బాగా చేయాలనే అభిప్రాయంతో వారి అనుమతితో ఆ నాటకాన్ని తీసుకుని తన బృందంతో  ప్రదర్శించినప్పుడు రెడ్డి గారిని కూడా ఆహ్వానించాం. రెడ్డి గారు నాటకాన్ని చూసి తన కన్నా బాగా చేసినట్టుగా ఉంది అని చాలా ఆనందించాడు.  అదే మాట వేదికపై కూడా చెప్పాడు. ప్రేక్షకునికి విసుగు కలగకుండా  4-5 నిమిషాలకు  మలుపు తిప్పి నాటకాన్ని నడిపితే  చూడాలన్న కుతూహలం బాగా పెరుగుతుంది. అలా నాటకాలు రాయడంలో మా స్నేహితుడు వేదాంతం శరత్ చంద్ర బాబు ముఖ్యుడు. బోసు నాటకాలన్నీ తనే వ్రాసేవాడు.  అలాంటి వాడికి సి రామ్ మోహన్ రావు గారు  ఆకాశవాణి నాటకాలలో ప్రధాన పాత్ర ఇచ్చేవాడు కాదు. విలన్, సైడ్ హీరో లాంటివి ఇచ్చేవాడు. దానికి కారణం  బోసు గాత్రం నా గాత్రం ఒక మాదిరిగా ఉంటాయి అని వారి అభిప్రాయం. రేడియో కానీ, సినిమా కానీ, చివరకు రంగస్థలం కానీ దగ్గరగా ఉన్న గాత్రాలు పనికిరావు.  చూడకుండా వినే వాడికి అర్ధం కాదు. అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నాటకానికి విజయం రాదు. జీవం లేకపోతే నాలుగు కాలలా పాటు ఏ నాటకము నిలబడాడు  ప్రతి నిర్వాహకుడు ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఒక సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారికి  చెప్పి మహామంత్రి తిమ్మరుసు నాటకాన్ని ప్రదర్శించి దానిలో రాయుడు వారి పాత్ర ధరించి  వారి మెప్పును పొందారు  నాటకాంతంలో వేదికపైకి వచ్చి  వై.యస్ గారు ఎస్.వి.రంగారావును మరిపించి మురిపించావయ్యా అని భుజం తట్టాడు.  మాకు అంతకన్నా కావాల్సింది ఏముంది. అలాంటి నటుడు నాకు బాల్య స్నేహితుడు కావడం చాలా ఆనందం.
ముసునూరు రత్న బోస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు.  విజయభాస్కర్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు గారి హయాంలో తాను ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను అందించారు.  ఏ మాత్రం రంగస్థల పరిచయం లేని వారితో కూడా నటింప చేసి నాటకం రాణించేలా ప్రదర్శింప చేశాడు. నల్లపురెడ్డి రాజకుమారి గారితో సంగీత కార్యక్రమాన్ని,  స్పీకర్ ప్రతిభా భారతి గారితో లంబాడీ యువతి వేషాన్ని  కుతూహలమ్మ గారితో పూసలమ్మే  అమ్మాయి వేషం,  శమంతకమణి గారితో కామెడీ పాట గీతారెడ్డి దానితో గౌతమబుద్ధుడు వీరందరితో వేషం వేయించి అందరి ప్రశంసలు పొందాడు.  జూపూడి యజ్ఞనారాయణ గారితో ఓల్డ దుర్యోధన పాత్ర చేయించి తాను యవ్వనంలో ఉన్న దుర్యోధన పాత్ర వహించాడు. ప్రఖ్యాత రంగస్థల నటుడు, దర్శకుడు  ప్రకాశం పంతులు గారి పాత్రలో జీవించిన చాట్ల శ్రీరాములు గారితో  మరో మోహంజోదారో నాటకాన్ని ప్రదర్శన చేశాడు.


కామెంట్‌లు