బ్రహ్మ రాత;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 హిందువుల నమ్మకాన్ని బట్టి  త్రిమూర్తులైన  మొదటి మూర్తి బ్రహ్మ సృష్టి చేస్తాడు  ద్వితీయ స్థానంలో ఉన్న ఇంద్రుడు  వాడికి  ఉన్నతిని పెరుగుదలను కల్పిస్తాడు  చివరగా శివుడు  ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని  అందిస్తాడు. మొదటి స్థానంలో ఉన్న  బ్రహ్మ గారు  సృష్టిని ప్రారంభించి  పుట్టిన రోజు నుంచి గిట్టే రోజు వరకు  అతని జీవిత క్రమం ఎలా ఉంటుందో లలాటం మీద వ్రాస్తాడు  మన పెద్దవారు చెప్తూ ఉంటారు నుదుటరాతను ఎవరూ తప్పించలేరురా  అది బ్రహ్మ రాసినది దానికి తిరుగులేదు అని. ఎవరికైనా ఒక రుగ్మత వచ్చినప్పుడు  దానికి తగిన మందు ఇవ్వడం  ఆచారం  కీలెరిగి వాత  అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఏ జబ్బు ఎలా వచ్చిందో దాని మూలానికి వెళ్లి  పూర్తిగా అధ్యయనం చేసి  అప్పుడు వైద్యం చేస్తే  అతి త్వరలో  తగ్గుతుంది. కీలెరిగి వాత అన్నవాడే  వీలెరిగి చేత అని కూడా అన్నాడు ఏదైనా ఒక పని చేయడానికి ముందు దానికి కారణాలు ఏమిటో తెలుసుకొని దానికి సరిపడిన పరిస్థితిలో పనులు చేయాలి  ఆ వీలు గనుక  చూడకపోయినట్లయితే చేసిన పని మొత్తం వృధా అయిపోతుంది. నారదమహర్షి ఒక సమయంలో  స్వర్గలోకానికి వెళుతూ అరణ్య మార్గంలో ఒక కపాలాన్ని చూస్తాడు  దాని నుదుటిన  ఇతని  మరణం తరువాత  అద్భుత జాతకం ప్రారంభమవుతుంది అన్న దానిని చూసి నారదుల వారికి బాగా కోపం వచ్చింది  బ్రహ్మ తెలిసి రాశాడా? తెలివి లేకుండా వ్రాశాడా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జాతకాలు ఏమిటి అని అతి వేగంగా వారి దర్శనం చేసుకోవడానికి వెళ్లి  ఏమి స్వామితమరు  చేసిన పని  అని కోపంగా అడిగేసరికి
నారద  మహర్షులకు కోపం పనికి రాదు  శాంతంగా ఆలోచించు  అతను చనిపోయిన తరువాత అతని జాతకం బాగుంటుంది అని రాశాను  ఇప్పుడు మీకు  తెలియని విషయం ఎక్కడో అరణ్యంలో మారుమూల పడి ఉన్న ఆ కాపాలాన్ని చూసి  పవిత్రమైన మీ చేతులతో దానిని పట్టుకొని  అక్కడ నుంచి స్వర్గలోకం వరకు తీసుకు వచ్చినప్పుడు  అక్కడి నుంచే జాతకం ప్రారంభమయ్యింది కదా. నేను రాసింది తప్ప  అనే చెప్పే సరికి క్షమాపణ కోరాడు మహర్షి  కనుక బ్రహ్మ ఏది రాస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది  ఎక్కువగాని, తక్కువగాని  ఉండడానికి అవకాశమే లేదు  నుదుట వ్రాసిన ప్రతి అక్షరం  జరిగి తీరుతుంది  అన్నది స్పష్టం  అంత నాస్తిక స్థితిలో ఉన్న వేమన కూడా ఈ స్థితిని నమ్మి  ఆట వెలుగులో మనక విషయాన్ని తెలియజేస్తున్నాడు  ఒకసారి చదవండి.
"వ్రాత కంటె హెచ్చు వరమీదు దైవంబు  
చేత కంటె హెచ్చు రాత లేదు  వ్రాతకజుడు కర్త చేతకు దాకర్త..."

కామెంట్‌లు