హీరో కృష్ణ;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 హీరో కృష్ణగా ప్రఖ్యాతిగాంచిన ఘట్టమనేని బుర్రిపాలెంలో బయలుదేరి రాజమండ్రిలో  డాక్టర్ రాజారావు గారి చైర్మన్ నాటకంలో పాత్ర కోసం వచ్చి  ఇతని నటన వారికి నచ్చకపోతే  కొడాలి గోపాల్ రావు రచయిత ప్రోత్సాహం వల్ల మాచినేని వెంకటేశ్వరరావు గారి దర్శకత్వంలో  కథానాయకునిగా అతని నటనా జీవితం ప్రారంభమైంది. చైర్మన్ గా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మద్రాస్ నుంచి వచ్చి నటించారు  రెండు ప్రదర్శనలు అయిన తర్వాత ఇద్దరు కలిసి మద్రాసు వెళ్లడంతో ఆ పాత్ర నేను వేయవలసి వచ్చింది మొత్తం 100 ప్రదర్శనలు ఇచ్చాను. విజయవాడలో నేను ప్రదర్శించిన నాటకానికి  కృష్ణను ఆహ్వానించినప్పుడు  నాటకం మొత్తం చూసి నాకన్నా మీరే చాలా బాగా చేశారు అన్నగారు అని  అభినందించారు. ఎదుటివారిలో ఏ చిన్ని  మంచి ఉన్న దానిని ఆస్వాదిస్తాడు. జగ్గయ్య గారి ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు చిత్రంలో ప్రథమంగా కథానాయకుడిగా  తెరపైకి వచ్చాడు. ఆ సినిమా పేరు లాగానే తన జీవితంలో  తన ప్రక్కన ఉన్న అందరికీ తేనెను పంచిన  సహృదయుడు మన కృష్ణ  అంచెలంచెలుగా ఎదిగి ఎదిగి తాను నిర్మించిన చిత్రాలు కానీ,  నటించిన చిత్రాలు కానీ మరెవ్వరికీ ఆ సాహసం లేదు అని చెప్పాలి. తాను చేసిన  ప్రతి సాహసం  అతనిని ఒక మెట్టు ఎక్కించిందే కానీ తగ్గించలేదు. తర్వాత బాపు గారి ద్వారా  విజయనిర్మల పరిచయం కావడం ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. పండంటి కాపురం చిత్ర నిర్మాణ సమయంలో నేను మద్రాసు వెళ్లినప్పుడు నేను, కృష్ణ విజయనిర్మల కూర్చుని మాట్లాడుకుంటూ తన పాత జీవిత విశేషాలను రికార్డు చేశాను అది ఆకాశవాడిలో ప్రసారమైంది కూడా. తరువాత నన్ను కొడాలి గోపాల్ రావుని మద్రాసు పిలిపించి విజయనిర్మల ఒక సినిమా లైన్ చెప్పి దానిని సినిమాగా తయారు చేయమంది. మా ఇద్దరికీ  ఆదిశేషగిరిరావు అన్ని ఏర్పాటు చేసేవాడు. 15 రోజులు జరిగినా  గోపాలరావు పూర్తి చేయలేకపోవడంతో  మరొక సినిమాను ఎన్నుకుంది  విజయనిర్మల. అగ్నిపర్వతంలో  కృష్ణ తో పాటు నేను, నండూరి సుబ్బారావు గారు కూడా నటించాము. కృష్ణ వ్యక్తిగతంగా పొందని బిరుదులు లేవు  రాజకీయాలలో కూడా అనుభవం కలిగిన వాళ్ళ లాగా ప్రవర్తించాడు. ఆయన తనకు మించిన దానధర్మాలు చేసి  ఎంతోమంది బీదవారిని ఆదుకున్నాడు.అలాంటివాడు భౌతికంగా ఆంధ్రులకు దూరం కావడం మన దురదృష్టం. ఆయన మనసుకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ ఆనంద్...
కామెంట్‌లు