దైవం ఒకటే;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కోరికలు బహు విధాలు  ఒకరికి మరొకరికి ఏమాత్రం సంబంధం ఉండదు కట్టమంచి రామలింగారెడ్డి గారు విజయవాడలో ఉపన్యాసం ఇస్తూ తాను బ్రహ్మచారిని అన్న విషయం తెలియడం కోసం  ఇక్కడ మార్కెట్లో ఆవు పాలు గేదె పాలు కూడా దొరుకుతున్నాయి కదా  నేను అది కొని ఆనందించవచ్చు కదా  ప్రత్యేకించి ఆ పాల కోసం ఒక గేదెను ఆవును మేపి దాని బాగోగులు చూసి  పాలు పితికి తాగడం అనేది  ఎంత కష్టంతో కూడిన పని  కనుక నా జీవితంలో అలా చేయను అని చెప్పారు  దానికి అనేక రకాల వ్యాఖ్యానాలు  చేసిన వారు లేకపోలేదు. వ్యక్తుల తత్వాలు ఎలా ఉంటాయంటే  పాలు కావాలి ఎలాంటి పాలు  అవి చిక్కగా ఉండాలి వెన్న శాతం ఎక్కువ రావాలి అని రకరకాల పేర్లతో ఉన్న  ఆవులను గేదెలను పరీక్షిస్తారు.
కాళిదాసు లాంటి వాడు కూడా  గమిడి గేదెలాగా ఉండి  తన చక్కటి పాలను  కాయడం కూడా  శాస్త్రోక్తంగా జరగాలి అంటాడు  శరదృతువులో చంద్రుడు మనకు అందించేటువంటి వెన్నెల  ఏ రంగులో ఉంటుందో  ఆ రంగు వచ్చేలా కాచి తోడిపెట్టి వెన్న తీసి ఆ వెన్నను కాచిన నేతితో  ఘుమఘుమలాడుతున్న వాసనతో  భోజనం చేయాలి  అని కోరుకుంటాడు. పాలు ఏదైనా ఒకటే కదా దీనిలో ఆవుపాలే కావాలి గేదె పాలే కావాలి దాంట్లో గమిడి గేదెనే బాగుంటుంది  మైసూర్ నుంచి వచ్చిన ఆవులైతేనే మేలు రకం పాలునిస్తాయి అంటూ అన్ని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా దానిని ఎద్దేవా చేస్తాడు వేమన. అలాగే ఆడపిల్లలకు పువ్వులు అంటే చాలా ఇష్టం పది సంవత్సరాలు దాటిన ఏ బాలికైన  రకరకాల పుష్పాలను తన జడలో అలంకరించు కోవాలనుకుంటుంది  దానికోసం  అనేక చోట్ల తిరిగి రకరకాల పూలను  కోసుకొస్తుంది. దానిని దండగా చేసి కొప్పులో  ఉంచుతుంది  ఏ రంగులో ఉన్న పుష్పమైన  పువ్వు పువ్వు కదా  ఆ పాప అలా ఆలోచించదు  అలాగే భగవంతుని దర్శనం చేసుకోవడానికి మనుషులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి  తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆయన మన కోరికలన్నీ తీరుస్తాడు. అని ఒక వర్గం అనుకుంటే  షిరిడి వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నట్లయితే  మనం పూర్వ జన్మలో అనుకున్నవి కూడా  సాధించుకోవచ్చు  అంటూ ముక్కోటి దేవతల పేర్లను ముచ్చదించుకుంటారు  అక్కడ చెప్తాడు వేమన  పేరులు వేరు కావచ్చు జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు ఎవరైనా కావచ్చు  కానీ దైవము అన్న  శబ్దం ఒకటే కదా  దానికోసం ఈ భిన్న భిన్న అభిప్రాయాలు పెట్టుకొని అనేక చోట్ల తిరగడం  మనిషి వెర్రితనం  అనే నిర్ణయిస్తాడు.  దీనికి మార్గం మనసును తన స్వాధీనంలో ఉంచుకోవడం  అని చక్కటి ఆటవెలదిని చెప్తున్నారు.
భగవంతుడు రకరకాల పువ్వులతో తనను అర్చించమని ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా  మరి ఈ పరిమితులు వ్యక్తికే కదా. ఆయన చెప్పిన పద్యాన్ని మీరు కూడా చదవండి.

"పసుల వన్నె వేరె పాలేకవర్ణమౌ  
పుష్ప జాతి వేరె
పూజ యొకటే 
దర్శనములు వేరె దైవం బదొక్కటే..."


కామెంట్‌లు