జనని- నాటకం; ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆకాశవాణిలో వార్షిక బహుమతులు ప్రారంభించిన తర్వాత  కొత్త కథలను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని  దానికి సరిపడిన నటీనటులను ఎన్నుకొని  నిర్వహణ ఆనందంగా చేయడానికి అలవాటు పడింది ఆకాశవాణి.  అలా నచ్చిన కథ జనని దాని రచయితను పిలిచి కృష్ణకుమారి  దానిని నాటికగా మలిచి విశాఖపట్నం కేంద్రం నుంచి పంపడానికి సన్నద్ధమైంది. మనకి ఇష్టమైన వారిని పాత్రలకు సరిపోయే వారిని ఎన్నుకోవడం ఒక ఆనవాయితీ కానీ ఇక్కడ కులాల వారీగా ఎంపిక జరుగుతోంది చాలాచోట్ల తన కులం వాడు ప్రధాన పాత్ర. కాని వాడు మరో చిన్న పాత్ర. అలా నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత కథానాయకుడిగా కాక ముసలి పాత్ర వేయవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి నాటిక పూర్తయి  ఢిల్లీ వెళ్లి బహుమతి కూడా గెలుచుకొచ్చింది దీనిలో కథానాయకుడు ఏ.వి రామారావు అతనితోపాటు నేను కె.విజయలక్ష్మి, నాగమణి, బీ.టి.కే కృష్ణకుమారి పాల్గొన్నాం. ప్రథమ బహుమతి వచ్చేసరికి భారతదేశంలో ఉన్న అన్ని రేడియో కేంద్రాలు వారి వారి భాషల్లో అనువదించి ప్రసారం చేశాయి. ఆరు నెలలు జరిగిన తర్వాత ఒకరోజు మైసూర్ లో జరుగుతున్న రిఫ్రెషడ్ కోర్సులకు పంపించారు నన్ను.  అక్కడ ఒకరోజు జనని  ప్రస్తావన వచ్చి మైసూర్ వారు కన్నడంలో ప్రసారం చేసిన నాటకాన్ని వినిపించారు నేను తెలుగు నాటకాన్ని వినిపించాను దానిలో నేను ధరించిన పాత్ర అక్కడ రంగస్థలం మీద  మంచి పేరు సంపాదించుకున్న 80 సంవత్సరాల ముసలాయన వేశాడు. ఆయన లేచి వచ్చి నన్ను కౌగిలించుకుని  మీరు సాయంత్రం మా ఇంటికి  టీకి రావాలని ఆహ్వానించారు  తప్పకుండా కలుద్దామని  ఇద్దరం కలిసి వెళ్లాం. ఇంటి లోపలి కూడా వెళ్లకుండా తన భార్యను పిలిచి జనని అనే నాటకంలో నేను చాలా గొప్పగా చేశాను అని ప్రశంసించావు కదా ఇవాళ తెలుగులో ఆనంద్ గారు చేసిన నాటకం వింటే నన్ను ఎందుకూ పనికిరాని వాడిగా చూస్తావు  అన్నారు నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ ఆహ్వానించి రాత్రి భోజనాలు అయ్యేంత వరకు కాలక్షేపం చేసి తిరిగి వచ్చాను. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.

కామెంట్‌లు