పిల్లల్లో క్రమశిక్షణ;-సి.హెచ్.ప్రతాప్ . ;-సెల్ : 95508 51075
 ఒక వ్యక్తికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే, ఆ వ్యక్తి ఖర్చులు అదుపులో ఉంటాయని, జీవితంలో ఆర్ధికంగా ఉన్నత స్థితికి ఎదుగుతాడని  వ్యక్తివ వికాస వేత్తలు అంటారు. అలా ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా క్రమశిక్షణ అలవరచుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తే ఉత్తమ స్థితిని,ఉజ్వల భవిష్యుత్తును పొందవచ్చునని కాబట్టి క్రమశిక్షణ మంచి భవిష్యత్తుకు పునాదిగా చెబుతారు.
యుక్త వయసుకు వచ్చాక విచ్చలవిడిగా ప్రవర్తించే స్వభావం రాకుండా ఉండాలంటే, విద్యార్ధి దశలోనే మంచి క్రమశిక్షణ అవసరం ఉంది. సరైన క్రమశిక్షణ లేకుండా పెరిగిన వ్యక్తులు, భావావేశాలకు లోనైనప్పుడు, తమపై తాము నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది.స్వీయ నియంత్రణ కోల్పోయాక తనపై, పరిస్థితులపై ఇక పట్టు వుండదు. ఎటు గాలి వీస్తే అటు ఎగిరే గాలి పటంలా చిందర వందరగా బ్రతుకు తయారవుతుంది.
బాల్యం నుండే సమయపాలన పాటించడం,చదువుల యందు శ్రద్ధ కలిగి ఉండడం. ఎంచుకున్న రంగంలో ఉత్తమ ఫలితం సాధించడానికి కృషి చేయడం… శరీరమునకు తగినంత వ్యాయామం చేయడం…. మానసికంగానూ, శారీరకంగానూ ధృఢంగా మారడంలో తగిన కృషి సల్పడం ఎంతో ముఖ్యం. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్ధి దశ నుండే సరైన మార్గదర్శకత్వం చేయాలి.
పెద్దలు పిల్లలకు క్రమశిక్షణ నేర్పే  విషయంలో కొంత మంది చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తున్న అనుకుంటారు. కానీ పిల్లల్లో మొండితనం ఎక్కువ అవుతుందని ఆలోచించరు.  ఎలా చేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎంత చెప్పినా అల్లరా మానరు, క్రమశిక్షణ పాటించరు, ఇంట్లో కూర్చో బెట్టిచదువు నేర్పిన చదువులో మాత్రం వెనకబడే ఉంటారు.  అలాంటప్పుడు పెద్దవాళ్లకు చెప్పలేనంత కోపం వస్తుంది.దాన్ని అదుపు చేసుకోలేక పిల్లల మీద అరవడం, కొట్టడము చేస్తుంటారు. ఒక్కోసారి దెబ్బల కంటే మాటలే పిల్లలను బాధ పెడుతుంటాయి. 
సి హెచ్ ప్రతాప్ 



కామెంట్‌లు