ఆధ్యాత్మికత;- సి.హెచ్.ప్రతాప్;-సెల్ ; : 95508 51075
 ఆధ్యాత్మికత అన్న పదానికి వేద శాస్త్రాలు ఇచ్చిన నిర్వచనం :
1. నిర్మలమైన హృదయం తో , పవిత్ర జీవనం కొనసాగించడం.
2. సకల జీవ రాసులలో భగవంతుని దర్శించగలగడం.
3. భగవంతునికి సంపూర్ణ , సర్వశ్య శరణాగతి చేసి  ప్రసాద భావంతో జీవించడం.
4. గురువులు, తల్లిదండ్రులు , వయస్సులో పెద్దల యందు గౌరవాభిమానములు కలిగి వుండడం.
5. సర్వ జీవ సమానత్వం భావనను ఆచరణలో పెట్టడం.
6. అత్యున్నత విలువలు,నీతి నియమాలు, నియమ నిష్టలతో , నిరంతరం ధర్మాచరణ ఒనరించడం.
7. కోరికలనే గుర్రాలను అదుపులో వుంచుకోవడం.
8. వేద,శాస్త్ర సమ్మతమైన కార్యములను మాత్రమే చేయడం.
9. ఏది నీది కాదో, అది ఎప్పటికీ నీకు చెందదు. నీ దగ్గరకు ఫ్రాదు. ఒకవేళ అవచ్చినా అది నీ దగ్గర వుండదు. ఒకవేళ తీవ్ర ప్రయత్నం తో సంపాదించాలని యత్నించినా అది నీ దగ్గర నిలబదదు. నీది కాని దాని గురించి అనవసరం గా ప్రయాస పడకు. ఇవి పదవులు, అధికారం, భోగభాగ్యాలు, ఆస్థి అంతస్థులు, మానవ సంబంధాలు ఏమైనా కావచ్చు.
10. ఏది నీకు పూర్వ జన్మ సుకృతం వలన చెందుతుందో అది స్వల్ప ప్రయత్నం వలన, దైవానుగ్రహం వలన , ఎన్ని కష్ట నష్టాలు , అడ్డంకులు ఎదురైనా నీవద్దకు వచ్చి తీరుతుంది. అది నీ వద్దే వుంటుంది. మానవమాత్రులెవరూ అది నీ దగ్గరకు రాకుండా అడ్డగించలేరు. మనకు జీవితం లో కష్టాలు, ఆందోళనలు, అశాంతి మనకు చెందని వాటిని వ్యర్ధ ప్రయాసతో చేజిక్కించుకునే ప్రయత్నాల వలనే వస్తాయి.
ఏది నీదో, ఏది నీది కాదో తెలుసుకోవడమే వివేకం. నిరంతర దైవ స్మరణ వలన అది మనకు అలవడుతుంది.

సి హెచ్ ప్రతాప్ 


కామెంట్‌లు