సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఘటించు...ఘట్టించు 
   *****
వ్యక్తిగా ఘటించునవి, మనసులో, ఆసక్తి, ఇష్టం ఉంటే ఘట్టించునవీ చాలానే ఉన్నాయి.
ఘటించు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది  "సంతాప సమయాల్లో  అంజలి ఘటించడం" అనే వాక్యం.
కానీ ఘటించు అంటే ఇంకా ఏమేమి అర్థాలున్నాయో చూద్దాం... చేయు,ఆచరించు,కావించు,నిర్వహించు,సంపాదించు,ఆర్జించు,గడించు, సముపార్జించు లాంటి అనేక అర్థాలున్నాయి.
మంచి పనులు ఆచరించి, విద్య, విజ్ఞానం,ధనం ఆర్జించాలనీ,సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనీ ఎవరికైనా ఉంటుంది.
 ఇలా ఘటించుతూ సంతోషంగా గడిపే వాళ్ళను చాలా మందిని మన చుట్టూ చూస్తూ ఉంటాం.
 ఇక మరికొందరికి ఘట్టించాలని కోరిక ఉంటుంది. సమాజానికి మేలు చేసేవి, అన్యాయం,అక్రమాలను రచనల ద్వారా ఘట్టించే కవులు రచయితలు కనిపిస్తూ ఉంటారు.
ఘట్టించు అంటే కూడా చాలానే అర్థాలు ఉన్నాయి.
ఉతుకు,చలువచేయు, రచించు,విరచించు,అల్లు,అవధరించు,చెప్పు,పలుకు లాంటివి ఎన్నో ఉన్నాయి.
నైతిక విలువలను ఘటించుదాం.
అమానవీయ పోకడలను ఘట్టించుదాం.


సాయంకాల నమస్సులతో 🙏

కామెంట్‌లు