సామాన్యుడు... మాన్యుడయి (లలిత గీతం :);-- కోరాడ నరసింహా రావు... !
పల్లవి :-
...సామాన్యుడు, మాన్యుడయి 
మన్నన పొందుటె ఘనత... !
 కృషీ పట్టుదల లే  ఉంటే.... 
ఇదిఎవరికైనసాధ్యమే కదా !!
     " సామాన్యుడు..... "
చరణం :-
...  చుక్కాని లేని నావేకదా... 
సామర్ధ్యం లేని జీవితం... 
  ఆ పడవను నడిపే నేర్పును చూపి,ఒడ్డుకుచేర్చుటే విజయం
      "  చుక్కానిలేని..... "  
   " సామాన్యుడు...మాన్యు.. "
చరణం :-
సమస్యలగాలి
 .    . అలలూ,సుడులు... 
తప్పించుకునీ రావాలి... !
  నిను నమ్ముకున్న వారందరినీ 
   తీరం చేర్చే తీరాలి... !!
     " సమస్యలగాలి..... "
   " సామాన్యుడు... మాన్యు.. "
  .... *******

కామెంట్‌లు