సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అదరించు...ఆదరించు
     ******
అదరించుటలో ఆధిపత్యం,అహంభావము  కొట్టొచ్చినట్టు కనబడుతాయి.
అదరించుట అనేది మనిషిలోని క్రోధ స్వభావాన్ని తెలుపుతుంది.
చెప్పేవి ఎంత మంచి విషయాలైనా, చేయించేవి హితవైన పనులైనా, భవిష్యత్తుకు దారి చూపే పాఠాలైనా అదరించి  చెప్పడం వల్ల ఆ వ్యక్తి పట్ల భయము, లోలోపల కోపము,ఒక లాంటి విముఖత కలగడం సహజం.
అదరించుటలో బెదరించు అనే అర్థమే కాదు భయపెట్టు,గద్దించు,జంకించు,జడిపించు,వెఱపించు,అదలించు,దట్టించు,జళికించు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
అందుకే అదరించు అనే అవలక్షణాన్ని తొలగించుకొని, ఆదరించుట నేర్చుకోవాలి.
ఆదరించుటలో హృదయ ఔన్నత్యం, మంచితనం మానవతా విలువలు ఉంటాయి.
 ఆదరించు అంటే గౌరవించు,అనునయించు,అభిమానించు,మన్నించు,,మన్నన చేయు,చేకొను, బహుమానించు,ఆదుకొను,చేరదీయు లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
అదరించు గుణమున్న వారిని అందరూ దూరం పెడతారు.
ఆదరించు హృదయమున్న వారిని గుండెల్లో నిలుపుకుంటారు. ఇందులోని సత్యాన్ని గ్రహించి ఎలా ఉండాలనేది వ్యక్తి యొక్క ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు