:"ఆత్మబంధువు";-నలిగల రాధికా రత్న.
రాత్రి ఒక కల వచ్చింది 
నువ్వు నా సరసన చేరి 
నాతో చెలిమి చేస్తున్నా 
కన్నుల్లో ఏదో దిగులు 
అది నన్ను 
కలవరపాటుకు గురిచేసింది..!!

హావభావాలను
అద్భుతంగా ఒలికిస్తూ..
చిత్రమైన ఊహలతో
అనురాగ సంగీతం వినిపిస్తూ...
కలల లోగిళ్ళలో
ఉక్కిరిబిక్కిరి చేస్తావెందుకని...
నీవు‌ మృదువుగా 
మందలించటమే...
నా దిగులు భావాలకి మూలం...!!

కన్నుల్లో కాంతి రేఖలు
పెదవి వంపుల్లో 
ఏరువాకలని కాదు..
మనసులోకి తొంగి చూడు 
నీకే తెలుస్తుంది 
తలపుల పరిమళాల కమ్మదనం...!!

రేయి పగలు మురిపించే
మధుర స్వప్నాల సాక్షిగా
నేను అనుకోని అతిథిని కాదు...
నీ మదిగదిలో కొలువైన 
"ఆత్మబంధువును"...!!


కామెంట్‌లు